![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
NPCIL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఖాలీలు.. శాలరీ ఎంతో తెలుసా?
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 72 ఖాళీలు ఉన్నాయి.
![NPCIL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఖాలీలు.. శాలరీ ఎంతో తెలుసా? NPCIL Recruitment 2021 for various vacancies know in details NPCIL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఖాలీలు.. శాలరీ ఎంతో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/04/081de2433bb9346ce838081a9a6ae59a_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఎన్పీసీఐఎల్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగ నోటిపికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మొత్తం 72 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ఎన్పీసీఐఎల్ స్పష్టం చేసింది. ఎన్పీసీఐఎల్ యొక్క నరోరా అటామిట్ పవర్ స్టేషన్ లో ఈ ఖాళీలు ఉన్నాయి.
స్టైఫండరీ ట్రైనీ, ఫార్మసిస్ట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, అసిస్టెంట్, నర్స్, స్టెనో విభాగాల్లో ఖాళీలు ఉన్నట్టు ఎన్పీసీఐఎల్ పేర్కొంది. ఎంపికైన వారికి నెలకు రూ. 44,900 వరకు వేతనం వస్తుంది. ట్రైనీ ఖాళీలకు ఎంపికైతే రెగ్యులర్ చేసే అవకాశం ఉందని కూడా నోటిఫికేషన్ లో తెలిపారు.
నర్స్ 5
స్టైఫండరీ ట్రైనీ 51
ఫార్మసిస్ట్ B 1
అసిస్టెంట్ గ్రేడ్-1 12
Steno గ్రేడ్-1 2
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 1
మొత్తం 72
ఆసక్తిగలవారు, అర్హులు.. అధికారిక వెబ్ సైట్ NPCIL కు వెళ్లాలి. హోం పేజీలో రిక్రూట్ మెంట్ కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి. అనంతరం అప్లై ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే.. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, లాగిన్ కనబడతాయి. ముందు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత యూజర్ నేమ్, పాస్ వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వాలి. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
Also Read: CISF Recruitment: సీఐఎస్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.... ఇలా దరఖాస్తు చేసుకోండి
Also Read: DRDO Recruitment 2021: డీఆర్డీవోలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి
Also Read: Jobs 2021: యూనివర్సిటీలలో వివిధ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్.. ఏమేం ఖాళీలు ఉన్నాయంటే..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)