Apprenticeship Mela: రేపు తెలుగు రాష్ట్రాల్లో అప్రెంటిస్ మేళా.. 5వ తరగతి చదివిన వారు కూడా అర్హులే..
దేశవ్యాప్తంగా 400కు పైగా ప్రాంతాల్లో రేపు (అక్టోబర్ 4) అప్రెంటీస్‌షిప్ మేళా జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేళా నిర్వహించనున్నారు. వీటిలో 2000కు పైగా కంపెనీలు పాల్గొంటాయి.
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పారిశ్రామిక అవసరాలకు తగినట్లు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (DGT), నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) సహకారంతో దేశవ్యాప్తంగా పలు మేళాల రూపంలో అర్హులను ఎంపిక చేసి.. వారికి శిక్షణ ఇస్తుంది. అప్రెంటీస్‌షిప్ పేరుతో అభ్యర్థులు శిక్షణ పొందే సమయంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. తాజాగా మరో అప్రెంటీస్‌షిప్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
దేశవ్యాప్తంగా 400కు పైగా ప్రాంతాల్లో రేపు (అక్టోబర్ 4) అప్రెంటీస్‌షిప్ మేళా జరగనుంది. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేళా నిర్వహించనున్నారు. వీటిలో 2000కు పైగా కంపెనీలు పాల్గొంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీలు కూడా ఈ మేళా నిర్వహించనున్నాయి. 5 నుంచి 12 తరగుతుల్లో పాస్ అయిన వారు, స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవారు, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ విద్యార్హత ఉన్న వారు ఈ మేళాకు హాజరుకావచ్చు. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలను సంప్రదించవచ్చు.
Also Read: ఏపీలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. 42 ఏళ్ల వారు కూడా అప్లై చేసుకోవచ్చు..
ఏపీలో 17 ప్రభుత్వ కాలేజీల్లో మేళా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17 ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో రేపు (అక్టోబర్ 4న) అప్రెంటీస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ లావ్యణ్య వేణి వెల్లడించారు. ఈ మేళాకు హాజరయ్యే వారు టెన్త్ మార్కుల మెమో, ఐటీఐ పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికేట్, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. మేళాలో ఎంపికైన వారికి శిక్షణ సమయంలో నెలకు కొంత స్టైఫండ్ చెల్లిస్తారని తెలిపారు. ట్రైనింగ్ పూర్తయ్యాక డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (DGT) నిర్వహించే పరీక్షలో ఉత్తర్ణత సాధించిన వారికి.. అప్రెంటీస్ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు.
ఏపీలో అప్రెంటీస్‌షిప్ మేళా నిర్వహించే కాలేజీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణలో అప్రెంటీస్‌షిప్ మేళా నిర్వహించే కాలేజీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..
ఏమేం తీసుకువెళ్లాలి?
1. రెస్యూమ్ - 3 కాపీలు
2. అధిక విద్యార్హత ఉన్న మార్క్ షీట్స్ - 3 కాపీలు
3. ఫొటో ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి)
4. పాస్ పోర్టు సైజు ఫొటోలు - 3
వేటిలో అప్రెంటీస్ చేయవచ్చంటే?
స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ - పవర్ గ్రిడ్, బ్యూటీషియన్, జనరల్ పెయింటర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కోపా, హౌస్ కీపర్ మొదలైన వాటికి శిక్షణ అందిస్తారు.
Also Read: రంగారెడ్డి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ జాబ్స్.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..