APPSC Recruitment 2021: ఏపీలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. 42 ఏళ్ల వారు కూడా అప్లై చేసుకోవచ్చు..
ఏపీపీఎస్సీ పలు ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటి ద్వారా హార్టికల్చర్ ఆఫీసర్, లెక్చరర్లు / అసిస్టెంట్ హోమియో ప్రొఫెసర్, తెలుగు రిపోర్టర్ పోస్టులను భర్తీ చేయనుంది.
![APPSC Recruitment 2021: ఏపీలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. 42 ఏళ్ల వారు కూడా అప్లై చేసుకోవచ్చు.. APPSC Recruitment 2021 for Horticulture Officer Post @psc.ap.gov.in, Check Application Process APPSC Recruitment 2021: ఏపీలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. 42 ఏళ్ల వారు కూడా అప్లై చేసుకోవచ్చు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/28/640b7397fc6865ae5e8a6d9a5258aefb_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. హార్టికల్చర్ ఆఫీసర్, లెక్చరర్లు / అసిస్టెంట్ హోమియో ప్రొఫెసర్, తెలుగు రిపోర్టర్ పోస్టుల భర్తీకి మూడు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానుండగా.. గడువు నవంబర్ 2వ తేదీతో ముగియనుంది. 24 అసిస్టెంట్ హోమియో ప్రొఫెసర్ / లెక్చరర్లు, 3 లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు స్వీకరణ గడువు అక్టోబర్ 28వ తేదీతో ముగియనుంది.
ఈ రెండో నోటిఫికేషన్లతో పాటు 5 తెలుగు రిపోర్టర్ల పోస్టుల భర్తీకి మరో ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కానుండగా.. గడువు నవంబర్ 8వ తేదీతో ముగియనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. నోటిఫికేషన్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ను సంప్రదించవచ్చు. ఈ పోస్టుల అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: ఏపీలో 151 ఉద్యోగాల భర్తీ.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. రూ.91 వేల వరకు వేతనం
విభాగాల వారీగా ఖాళీలు..
విభాగం | ఖాళీల సంఖ్య |
హార్టికల్చర్ ఆఫీసర్ | 39 |
అసిస్టెంట్ హోమియో ప్రొఫెసర్ / లెక్చరర్లు | 24 |
లెక్చరర్లు/ అసిస్టెంట్ ప్రొఫెసర్ | 3 |
తెలుగు రిపోర్టర్లు | 5 |
నోటిఫికేషన్ల డైరెక్ట్ లింక్‌లు ఇవే..
నోటిఫికేషన్ 1: హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ 2: అసిస్టెంట్ హోమియో ప్రొఫెసర్ / లెక్చరర్లు పోస్టుల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ 3: లెక్చరర్లు/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ 4: తెలుగు రిపోర్టర్ పోస్టుల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..
విద్యార్హత, వయోపరిమితి..
హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు.. హార్టికల్చర్‌లో నాలుగేళ్ల బీఎస్సీ డిగ్రీ లేదా బీఎస్సీ ఆనర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (దివ్యాంగ) అభ్యర్థులకు వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంది.
తెలుగు రిపోర్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్‌బీటీఈటీ హైదరాబాద్ నిర్వహించిన షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ (తెలుగు)లలో హయ్యర్ గ్రేడ్ అర్హతను కలిగి ఉండాలి. దీంతోపాటు నిమిషానికి 80 పదాల వేగంతో తెలుగు షార్ట్ హ్యాండ్ టైపింగ్ తప్పనిసరిగా ఉండాలి. 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు అందించారు.
Also Read: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ముఖ్యమైన తేదీలివే..
Also Read: ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో 3093 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)