Medical Officer Jobs: రంగారెడ్డి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ జాబ్స్.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా 93 మెడికల్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) కార్యాలయంలో 93 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అర్హులను ఎంపిక చేయనున్నారు. కేవలం అకడమిక్ మెరిట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు గడువు అక్టోబర్ 10వ తేదీతో ముగియనుంది. ఎంబీబీఎస్ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. దీంతో పాటుగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రర్ అయి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://rangareddy.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
26న తుది మెరిట్ లిస్ట్..
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన అక్టోబర్ 13 నుంచి 20వ తేదీ వరకు ఉంటుంది. అక్టోబర్ 21న మెరిట్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్ 21 నుంచి 25 వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. తుది మెరిట్ లిస్ట్‌ను అక్టోబర్ 26న ప్రకటిస్తారు. అక్టోబర్ 27న కౌనెల్సింగ్ నిర్వహించే అవకాశం ఉంది. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు.. రూ.1.66 లక్షల వరకు వేతనం.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం..
ఎంపిక చేస్తారిలా..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ముందుగా అభ్యర్థుల అకడమిక్ మెరిట్ వివరాలను పరిశీలిస్తారు. దీని ఆధారంగా కొంతమందిని షార్ట్ లిస్ట్ (Short list) చేస్తారు. అనంతరం వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు చేసుకోండిలా..
అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం https://rangareddy.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇందులో నోటిఫికేషన్స్ (NOTIFICATIONS) ఆప్షన్ ఎంచుకోవాలి. దీని చివరన అప్లికేషన్ ఫాం అని ఉంటుంది. దానిని ప్రింట్ తీసుకోవాలి. విద్యార్హత, అనుభవం తదితర వివరాలు నమోదు చేసి నోటిఫికేషన్లో సూచించిన ధ్రువపత్రాల జిరాక్స్‌లను పోస్టు చేయాలి. దరఖాస్తులను డీఎంహెచ్ఓ, రంగారెడ్డి, తెలంగాణ చిరునామాకు పోస్టు చేయాల్సి ఉంటుంది.
Also Read: ఏపీలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. 42 ఏళ్ల వారు కూడా అప్లై చేసుకోవచ్చు..
ఏయే సర్టిఫికెట్లు కావాలంటే?
టెన్త్, ఇంటర్, ఎంబీబీఎస్ సర్టిఫికెట్లతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TMC)లో రిజిస్టరైన సర్టిఫికెట్ పంపాల్సి ఉంటుంది. వీటితో పాటుగా పాస్ పోర్టు ఫోటో కూడా పంపాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లు అయితే సర్టిఫికెట్ కూడా పంపించాలి.
Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..
Also Read: ఏపీలో 151 ఉద్యోగాల భర్తీ.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. రూ.91 వేల వరకు వేతనం