అన్వేషించండి

Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

MHSRB: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి వైద్యారోగ్య సేవల బోర్డు సెప్టెంబరు 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Telangana Nursing Officer Notification: తెలంగాణలో నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో 2050 నర్సుల పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) సెప్టెంబరు 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ/వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్ నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్ పరిధిలో 332 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 పోస్టులు, ఆయుష్‌ విభాగంలో 61 పోస్టులు, ఐపీఎంలో ఒక స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు  నవంబరు 17న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ సహా 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

వివరాలు..

* నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 2050.

జోన్లవారీగా ఖాళీలు.. 

జోన్ ఖాళీలు జోన్లవారీగా జిల్లాలు
జోన్-1 241  ఆసిఫాబాద్-కుమ్రంభీం; మంచిర్యాల; పెద్దపల్లి; జయశంకర్ - భూపాలపల్లి; ములుగు
జోన్-2 86 ఆదిలాబాద్; నిర్మల్; నిజామాబాద్; జగిత్యాల
జోన్-3 246 కరీంనగర్; సిరిసిల్ల-రాజన్న; సిద్దిపేట; మెదక్; కామారెడ్డి
జోన్-4 353  కొత్తగూడెం-భద్రాద్రి; ఖమ్మం; మహబూబాబాద్;
హనుమకొండ (వరంగల్ అర్బన్); వరంగల్ (వరంగల్ రూరల్)
జోన్-5 187 సూర్యాపేట; నల్గొండ; భువనగిరి-యాదాద్రి; జనగాం
జోన్-6 747  మేడ్చల్-మల్కాజిగిరి; హైదరాబాద్; రంగారెడ్డి; సంగారెడ్డి; వికారాబాద్
జోన్-7 114 మహబూబ్ నగర్; నారాయణపేట; జోగులాంబ-గద్వాల్; వనపర్తి; నాగర్ కర్నూల్

విద్యార్హత: జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ (GNM) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: 08.02.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి 3 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది. 

ఫీజు: అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.500, దరఖాస్తు ఫీజు కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, తెలంగాణకు చెందిన ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు, నిరుద్యోగ యువతకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా. మొత్తం 100 పాయింట్లకు ఎంపిక విధానంల ఉంటుంది. ఇందులో రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.

పరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇంగ్లిష్‌లోనే ప్రశ్నలు ఉంటాయి. 

సిలబస్: అనాటమీ అండ్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, సైకాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్-ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్‌మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రీషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్‌వైఫరీ అండ్ గైనకాలజికల్ నర్సింగ్, గైనకాలజికల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, రిసెర్చ్ (ఇంట్రడక్షన్), ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జెస్ట్‌మెంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్‌మెంట్. 

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.

జీతం: రూ.36,750 – రూ.1,06,990

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.9.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 14.10.2024 5.00 pm 

➥ దరఖాస్తుల సవరణ: 16.10.2024  (10.30 AM) 17.10.2024 to 5.00 PM 

➥ ఆన్‌లైన్ పరీక్ష (సీబీటీ) తేదీ: 17.11.2024.

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు..
➥ ఆధార్ కార్డు
➥ పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికేట్(పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం)
➥ జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్
➥ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
➥ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, కాంట్రాక్ట్/ఔట్‌సోర్స్ సర్వీస్ ఇన్‌స్టేట్ ప్రభుత్వ ఆసుపత్రులు/సంస్థలు/ ప్రోగ్రామ్‌ల విషయంలో (వర్తిస్తే)
➥ స్టడీ సర్టిఫికేట్(1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు) లోకల్ స్టేటస్ క్లైమ్ చేయడానికి
➥ స్థానిక హోదాను క్లెయిమ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం (1వ తరగతి నుండి 7వ తరగతి వరకు) జారీచేసిన నివాస ధృవీకరణ పత్రం ఉండాలి.
➥ కమ్యూనిటీ సర్టిఫికేట్ (SC/ST/BC)
➥ నాన్-క్రిమీలేయర్ సర్టిఫికేట్ (BC)  
➥ ఇన్‌కమ్ సర్టిఫికేట్ (EWS)
➥ స్పోర్ట్స్ సర్టిఫికేట్
➥  SADAREM సర్టిఫికేట్
➥  NCC సర్టిఫికేట్ 
➥  ఇన్-సర్వీస్ ఉద్యోగులైతే సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి
➥  అభ్యర్థి ఫొటో, సంతకం (Jpg/Jpeg/png ఫార్మాట్‌లో)  

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget