(Source: ECI/ABP News/ABP Majha)
MECL: మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో 53 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
నాగ్‌పుర్‌లోని మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఈసీఎల్) ఆధ్వర్యంలో ఉన్న మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నాగ్‌పుర్‌లోని మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఈసీఎల్) ఆధ్వర్యంలో ఉన్న మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 53 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 53
* నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
1) అకౌంటెంట్: 06 పోస్టులు
2) హిందీ ట్రాన్స్‌లేటర్: 01 పోస్టులు
3) టెక్నీషియన్ (సర్వే & డ్రాఫ్ట్స్‌మ్యాన్): 06 పోస్టులు
4) అసిస్టెంట్ (శాంప్లింగ్): 10 పోస్టులు
5) ఎలక్ట్రీషియన్ (ల్యాబొరేటరీ): 05 పోస్టులు
6) అసిస్టెంట్ (మెటీరియల్స్): 05 పోస్టులు
7) అసిస్టెంట్ (అకౌంట్స్): 04 పోస్టులు
8) అసిస్టెంట్ (హెచ్‌ఆర్): 07 పోస్టులు
9) అసిస్టెంట్ (హిందీ): 01 పోస్టులు
10) ఎలక్ట్రీషియన్: 04 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
పని అనుభవం: కనీసం 03 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.20200-రూ.55900 చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేది: 13.09.2023.
ALSO READ:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 95 ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 95 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 07 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..