KVS Recruitment: కేవీల్లో 13,404 ఉద్యోగాల పరీక్ష తేదీలు వచ్చేశాయ్, షెడ్యూలు ఇదే!
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు.
కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూలు కేంద్రీయ విద్యాలయం సంగతన్ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్, రీచెకింగ్ చేసుకోవడానికి అభ్యర్థులకు ఎలాంటి అవకావం ఉండదు. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను అభ్యర్థుల ఈమెయిల్ ఐడీకి పంపుతారు. పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తారు. ఆ తర్వాత ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ కీ విడుదల చేస్తారు. అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కటాఫ్ మార్కులతో సహా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ అసిస్టెంట్ కమిషనర్
పరీక్షతేది: 07.02.2023
➥ ప్రిన్సిపల్
పరీక్షతేది: 08.02.2023
➥ వైస్ ప్రిన్సిపల్ & పీఆర్‌టీ (మ్యూజిక్)
పరీక్షతేది: 09.02.2023
➥ టీజీటీ
పరీక్షతేది: 12-14 ఫిబ్రవరి 2023
➥ పీజీటీ
పరీక్షతేది: 16-20 ఫిబ్రవరి 2023
➥ ఫైనాన్స్ ఆఫీసర్, ఏఈ (సివిల్), హిందీ ట్రాన్స్‌లేటర్
పరీక్షతేది: 20.02.2023
➥ పీఆర్‌టీ
పరీక్షతేది: 21-28 ఫిబ్రవరి 2023
➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
పరీక్షతేది: 01-05 మార్చి 2023.
➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II
పరీక్షతేది: 06.03.2023
➥ లైబ్రేరియన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ & సీనియర్ సెక్రిటేరియట్ అసిస్టెంట్
పరీక్షతేది: 06.03.2023.
6990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
6414 ప్రైమరీ టీచర్ పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
'మున్సిపల్' ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా 78 పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు ఉన్నాయి. కామర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో 544 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 31 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులకు మే లేదా జూన్‌లో నియామక పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ - అర్హతలివే!
తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రాతపరీక్ష ద్వారా ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
➥ తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
➥ తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
➥ 8039 పోస్టులకే 'గ్రూప్-4' నోటిఫికేషన్ - అర్హతలు, దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!