అన్వేషించండి

IOCL Recruitment: ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌లో 467 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఖాళీల వివరాలు ఇలా

IOCL Jobs: ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌లో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఆగస్టు 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

IOCL Non-Executive Recruitment 2024: ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 467 జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో ఐవోసీఎల్ ప్లాంట్లలో 400 పోస్టులు, పైప్ యూనిట్లలో 67 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 22న ప్రారంభంకాగా.. ఆగస్టు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. 

ఖాళీల వివరాలు..

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 467 (ప్లాంట్స్-400, పైప్స్ యూనిట్స్-67 పోస్టులు)

1) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌: 198 పోస్టులు
విభాగం: ప్రొడక్షన్. 
అర్హత: 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (కెమికల్ ఇంజినీరింగ్/పెట్రో కెమికల్ ఇంజినీరింగ్/కెమికల్ టెక్నాలజీ/రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్) లేదా బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

2) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌: 33 పోస్టులు
విభాగం: పీ అండ్ యూ. 
అర్హత: మూడేళ్ల డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా రెండేళ్ల ఐటీఐ(ఫిట్టర్) (లేదా)  బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

3) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌: 22 పోస్టులు
విభాగం: పీ అండ్ యూ, ఓ అండ్ ఎం (P&U-O&M).
అర్హత: 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

4) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌/ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 25 పోస్టులు
విభాగం: ఎలక్ట్రికల్. 
అర్హత: 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

5) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌/ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 50 పోస్టులు
విభాగం: మెకానికల్. 
అర్హత: 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా పదోతరగతి అర్హతతో రెండేళ్ల ఐటీఐ(ఫిట్టర్) ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

6) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌/ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 24 పోస్టులు
విభాగం: ఇన్‌స్ట్రుమెంటేషన్. 
అర్హత: 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా (ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్/అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

7) జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్: 21 పోస్టులు
విభాగం: క్వాలిటీ కంట్రోల్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

8) జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌: 27 పోస్టులు
విభాగం: ఫైర్ అండ్ సేఫ్టీ. 
అర్హత: పదోతరగతితోపాటు NFSC-నాగ్‌పూర్ నుంచి 'సబ్ ఆఫీసర్స్' కోర్సు లేదా తత్సమాన కోర్సు చేసి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ప్రొఫీషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.07.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2024.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 10.09.2024.

➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష: సెప్టెంబరులో.

➥ ఫలితాల వెల్లడి: అక్టోబరు మూడో వారంలో.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget