X

Indian Coast Guard Recruitment 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. అభ్యర్థులు చేయాల్సినవి.. చేయకూడనివి.. ఇవే..

ఇండియన్ కోస్ట్ గార్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో పలు ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ జరుగుతోంది.

FOLLOW US: 

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు joinindiancoastguard.gov.inలో కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 6న ప్రారంభమైంది. డిసెంబర్ 17, 2021న ముగుస్తుంది. జనరల్ డ్యూటీ, సీపీఎల్, టెక్నికల్ కోర్సుల్లో 50 పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2021 ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు  ప్రారంభం: 6 డిసెంబర్ 2021
  • ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 17 డిసెంబర్ 2021
  •  అడ్మిట్ కార్డ్ జారీ: 28 డిసెంబర్ 2021 నుంచి.. కోస్టుగార్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
  • పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎంపిక ప్రక్రియ:
అర్హత పరీక్షలో ఎక్కువ శాతం మార్కుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా ఈ నియామకాలు చేస్తారు. ప్రిలిమినరీ సెలక్షన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ఫైనల్ సెలక్షన్‌కి పిలుస్తారు. తుది ఎంపికలో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ మరియు ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) ఉంటాయి. ధృవీకరించబడిన అన్ని డాక్యుమెంట్‌లు/సర్టిఫికేట్‌లు కూడా తీసుకురావాలి. 

జనరల్ డ్యూటీ అండ్ టెక్నికల్ (ఇంజనీరింగ్ & ఎలక్ట్రికల్) కోసం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. అయితే కమర్షియల్ పైలట్ ఎంట్రీ (CPL-SSA) కోసం పురుషులు మరియు స్త్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కమర్షియల్ పైలట్ ఎంట్రీకి అప్లై చేసుకునే అభ్యర్థులు మొత్తం 60 శాతం మార్కులతో  ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు.. కనీసం 60 శాతం మార్కులతో నిర్దేశిత.. బ్రాంచిల్లో బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2021 ఖాళీల వివరాలు..
GD: 30 పోస్ట్‌లు
CPL (SSA): 10 పోస్టులు
టెక్నికల్: 10 పోస్టులు

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2021 పే స్కేల్..
అసిస్టెంట్ కమాండెంట్ - రూ.56,100
డిప్యూటీ కమాండెంట్ - రూ.67,700
కమాండెంట్ (జెజి) - రూ.78,800
కమాండెంట్ - రూ.1, 23,100
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ - రూ.1, 31,100
ఇన్‌స్పెక్టర్ జనరల్ - రూ.1, 44,200
అదనపు డైరెక్టర్ జనరల్ - రూ.1, 82,200
డైరెక్టర్ జనరల్ - రూ.2, 25,000

అభ్యర్థులు ఏదైనా ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే అన్నింటినీ రద్దు చేస్తారు. ప్రస్తుతం చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రిలిమినరీ పరీక్షలకు వెళ్లినప్పుడే సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, నకలు కాపీలు, ఫొటోలు, ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. ఇవి లేకుండా పరీక్షకు అనుమతించరు.

Also Read: BEL Recruitment 2021: మచిలీపట్నం 'బెల్'లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేయాలంటే..

Also Read: CSIR Recruitment: సీఎస్ఐఆర్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.. జీతం ఏంతంటే.. 

Also Read: NPCIL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో ఖాలీలు.. శాలరీ ఎంతో తెలుసా?

Tags: Latest Job Updates Indian Coast Guard Indian Coast Guard Recruitment 2021 Coast Guard jobs 2021 job recruitments

సంబంధిత కథనాలు

ICMR Recruitment 2022: పదోతరగతి పాసై తెలుగు తెలిసిన వాళ్లకు ఐసీఎంఆర్‌లో ఉద్యోగ అవకాశాలు

ICMR Recruitment 2022: పదోతరగతి పాసై తెలుగు తెలిసిన వాళ్లకు ఐసీఎంఆర్‌లో ఉద్యోగ అవకాశాలు

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

Compassionate Appointments: ఏపీలో ఆ ఉద్యోగుల కుటుంబాల కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ

Compassionate Appointments: ఏపీలో ఆ ఉద్యోగుల కుటుంబాల కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ

NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?

NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?

Railway Recruitment 2022: పదో తరగతి విద్యార్హతతో రైల్వే ఉద్యోగాలు.. రెండు వేలకుపైగా ఖాళీలు.

Railway Recruitment 2022: పదో తరగతి విద్యార్హతతో రైల్వే ఉద్యోగాలు..  రెండు వేలకుపైగా ఖాళీలు.
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Oscars 2022: ఆస్కార్ బరిలో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్' 

Oscars 2022: ఆస్కార్ బరిలో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్' 

YSRCP: ‘మెప్పు కోసం విప్పుకు తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ

YSRCP: ‘మెప్పు కోసం విప్పుకు తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ

Hyderabad Microsoft : హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల గిఫ్ట్.. రూ. 15వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మైక్రోసాఫ్ట్ !

Hyderabad Microsoft :  హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల గిఫ్ట్.. రూ. 15వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మైక్రోసాఫ్ట్ !

Balakrishna: అభిమానులూ... బాలయ్యను కలుస్తారా? మీకు ఇదొక మంచి ఛాన్స్!

Balakrishna: అభిమానులూ... బాలయ్యను కలుస్తారా? మీకు ఇదొక మంచి ఛాన్స్!