అన్వేషించండి

NCC Special Entry Scheme: డిగ్రీ అర్హతతో 'ఆర్మీ'లో ఆఫీసర్ పోస్టులు - ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ నోటిఫికేషన్ విడుదల

NCC Special Entry Scheme: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కోర్సు ద్వారా నియామకాలు చేపట్టనున్నారు.

Indian Army NCC Special Entry Scheme 57th Course: ఇండియన్ ఆర్మీలో 'ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్' 57వ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు 2025 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 11న ప్రారంభంకాగా.. ఆగస్టు  9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

వివరాలు..

➥ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ (57వ కోర్సు) -  షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ) ఆఫీసర్లు

* మొత్తం ఖాళీలు: 76

1) ఎన్‌సీసీ (మెన్): 70 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ కేటగిరీ-63, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-07.

2)  ఎన్‌సీసీ (ఉమెన్): 06 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ కేటగిరీ-05, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-01.

ALSO READ: ఇండియన్ నేవీలో బీటెక్ కోర్సు, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం - వివరాలు ఇలా

అర్హతలు..

✦ కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు ఎన్‌సీసీ‌ సర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వీరికి ఎన్‌సీసీ సర్టిఫికెట్ అవసరం లేదు. 

✦ మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ-సి సర్టిఫికెట్‌లో కనీసం బి-గ్రేడ్‌ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ-సి సర్టిఫికెట్‌ అవసరం లేదు. 

వయోపరిమితి: 01.01.2025 నాటికి 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.2000 - 01.01.2006 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇతర అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది రెండు దశల్లో ఈ ప్రక్రియ ఉంటుంది.  స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు ఉంటాయి. స్టేజ్-1లో ఫెయిల్ అయిన అభ్యర్థులను స్టేజ్-2కి ఎంపిక చేయరు, వారు అదే రోజు తిరిగివెళ్లొచ్చు. స్టేజ్-1లో ఎంపిక అయిన అభ్యర్థులకు స్టేజ్-2 ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ఉంటుంది. ఇందులో ఎంపిక అయిన వారికి చివరగా మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్  ఉంటుంది.

శిక్షణ,స్టైపెండ్ వివరాలు:  ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. నెలకు రూ.56,100 చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో పోసింగ్ ఇస్తారు. వీరికి 6 నెలలపాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. నిర్ణీత పేస్కేలు ప్రకారం ఇతర అలవెన్సులు ఇస్తారు. పనితీరు సక్రమంగా లేకపోయినా, ఆరోగ్య సమస్యలు తలెత్తిన విధుల నుంచి తొలగిస్తారు.

పేస్కేలు ఇలా..

NCC Special Entry Scheme: డిగ్రీ అర్హతతో 'ఆర్మీ'లో ఆఫీసర్ పోస్టులు - NCC స్పెష‌ల్ ఎంట్రీ నోటిఫికేషన్ వెల్లడి

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.07.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.08.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Maharashtra Elections : మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Maharashtra Elections : మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
Jio Cloud PC: చిటికేస్తే మీ ఇంట్లో టీవీ కంప్యూటర్‌ అయిపోతుంది - 'జియో క్లౌడ్‌ పీసీ'తో మ్యాజిక్‌ చేయండి
చిటికేస్తే మీ ఇంట్లో టీవీ కంప్యూటర్‌ అయిపోతుంది - 'జియో క్లౌడ్‌ పీసీ'తో మ్యాజిక్‌ చేయండి
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Embed widget