అన్వేషించండి

Indian Army: బీటెక్‌ అర్హతతో ఆర్మీ కొలువులు, ఏడాదికి రూ.18 లక్షలు జీతంగా పొందే ఛాన్స్

Army: ఇండియన్ ఆర్మీలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.

Indian Army SSC Tech Recruitment: ఇంజినీరింగ్‌ అర్హతతో ఇండియన్ ఆర్మీలో కొలువులకు నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)లో 379 టెక్నికల్ పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో పురుషులకు 350, మహిళలకు 29 పోస్టులను కేటాయించారు. వివాహంకాని పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. వీటిల్లో అర్హత సాధించినవారికి  ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత పీజీ డిప్లొమా అందుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. ఇండియన్‌ ఆర్మీ ద్వారా ఏటా రెండుసార్లు టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఉద్యోగాలకు ఎంపికైనవారికి సీటీసీ రూపంలో ఏడాదికి రూ.18 లక్షలు వేతనంగా ఇస్తారు. 

వివరాలు..

* షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ టెక్నికల్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 379 (మెన్-350, ఉమెన్-29) 

విద్యార్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి బీటెక్‌ (ఐటీ)తోపాటు ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారూ అర్హులే. 

వయోపరిమితి: 01.10.2025 నాటికి 20 నుంచి  27 సంవత్సరాలలోపు ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీరికి సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. మొత్తం రెండు దశల్లో 5 రోజులపాటు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇందులో భాగంగా మొదటిరోజు నిర్వహించే స్టేజ్‌-1లో ఉత్తీర్ణులైనవారికి తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇందులోనూ విజయవంతమైనవారికి మెడికల్ టెస్టులు నిర్వహించి, తుదిఎంపిక చేస్తారు.

 

శిక్షణ వివరాలు..

➥ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో అక్టోబరు నెల నుంచి శిక్షణ ప్రారంభంకానుంది. మొత్తం 49 వారాలపాటు శిక్షణ కొనసాగనుంది.

➥ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసినవారికి మద్రాస్‌ యూనివర్సిటీ పీజీ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని ప్రదానంచేస్తారు.

➥ ఆ తర్వాత వీరిని లెఫ్టినెంట్‌ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. విధుల్లో చేరినవారు పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి (పర్మనెంట్‌ కమిషన్‌) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు.

➥ లెఫ్టినెంట్‌ విధుల్లో చేరినవారు 2 సంవత్సరాల అనుభవంతో కెప్టెన్, 6 సంవత్సరాల సేవలతో మేజర్, 13 సంవత్సరాలు కొనసాగితే లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాకు చేరుకునే అవకాశం ఉంటుంది. మొదటి నెల నుంచే అన్నీ అలవెన్సులు కలిపి దాదాపు రూ.1.5 లక్షల వరకు వేతనం పొందవచ్చు. 

స్టైపెండ్, వేతనం: అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్‌‌గా చెల్లిస్తారు. ఆ తర్వాత హోదాలను బట్టి రూ.2,50,000 వరకు వేతనం ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 05.02.2025. 

Notification

Online Application

Website  

ALSO READ:

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Allu Arjun: బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
బాలీవుడ్ హీరోలెవరు ఇప్పటి వరకు అలా చేయలేదు... అల్లు అర్జునే ఫస్ట్ హీరో
Viral News: ఆ ప్రొఫెసర్‌ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
ఆ ప్రొఫెసర్‌ ఫోన్‌లో 72 అశ్లీల వీడియోలు - అన్నీ విద్యార్థులతోనే - ఇతను గురువేనా ?
Embed widget