UCIL: యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
UCIL: యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Uranium Corporation of India Limited Recruitment: ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL).. వివిధ విభాగాల్లో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితోపాటు ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐటీఐలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తులు సమర్పింవచ్చు. విద్యార్థులు అప్రెంటిస్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి అప్రెంటిస్ యాక్ట్ నిబంధనల మేరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇప్పటికే అప్రెంటిస్ శిక్షణ పూర్తిచేసినవారు, అప్రెంటిస్ శిక్షణ పొందుతున్నవారు దరఖాస్తుకు అనర్హులు. అయితే శిక్షణకాలం పూర్తయిన తర్వాత సంస్థలో శాశ్వత ఉద్యోగంలో చేర్చుకోరన్న విషయం అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది.
వివరాలు..
* ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్
ఖాళీల సంఖ్య: 228.
విభాగాల వారీగా ఖాళీలు..
➥ ఫిట్టర్: 80
➥ ఎలక్ట్రిషీయన్: 80
➥ వెల్డర్: 38
➥ టర్నర్/మెషినిస్ట్: 10
➥ ఇనుస్ర్టుమెంట్ మెకానిక్: 04
➥ డిజిల్ మెకానిక్/మోటర్ వెహికిల్ మెకానిక్: 10
➥ కార్పెంటర్: 03
➥ ప్లంబర్: 03
వ్యవధి: ఏడాది.
అర్హత: పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీవీటీ (NCVT) సర్టిఫికేట్ తప్పనిసరి.
వయోపరిమితి: 03.01.2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలపాటు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఐటీఐలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
స్టైపెండ్: అప్రెంటిస్ యాక్ట్ నిబంధనల మేరకు స్టైపెండ్ ఇస్తారు.
దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు..
➥ మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ & మార్కుల షీట్, ఐటీఐ ఫైనల్ సర్టిఫికేట్ & మార్కుల షీట్.
➥ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ(NCL) అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికేట్.
➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
➥ దివ్యాంగులకు మెడికల్ సర్టిఫికేట్
➥ అభ్యర్థుల ఫొటో, సంతకం.
➥ ఆధార్ కార్డు, పాన్ కార్డు
➥ ఆధార్ కార్డు లింకై ఉన్న బ్యాంకు అకౌంట్.
➥ ల్యాండ్ అక్విజేషన్ సర్టిఫికేట్
➥ సంస్థ ఉద్యోగి అయితే ఐడీకార్డు, ఆధార్ కార్డు.
దరఖాస్తుకు చివరితేదీ: 02.02.2025.
Notification & Application(Employee)
ALSO READ:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టులు, 1.4 లక్షల వరకు జీతం
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దీనిద్వారా మొత్తం 350 పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు తగిన పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. సరైన అర్హతలు ఉన్నవారు జనవరి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

