BEL: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టులు, 1.4 లక్షల వరకు జీతం
BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 350 ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు జనవరి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

BEL Recruitment of Probationary Engineers: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 350 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ /బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. సరైన అర్హతలు ఉన్నవారు జనవరి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు, పూణె, ఘజియాబాద్, నేవీ ముంబయి, ఉత్తరాఖండ్, హరియాణాలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది
వివరాలు..
ఖాళీల సంఖ్య: 350 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 143, ఈడబ్ల్యూఎస్- 35, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 94, ఎస్సీ- 52, ఎస్టీ- 26.
* ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు
⏩ ఎలక్ట్రానిక్స్- 200 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ /బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
⏩ మెకానికల్- 150 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ /బీఎస్సీ (మెకానికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు రూ.1180(1000 + జీఎస్టీ); ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
BEL దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి కావల్సిన సూచనలు..
➥ ఫస్ట్ బెల్ ప్రొబేషనరీ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ కోసం అధికారిక వెబ్‌సైట్ పోర్టల్ bel-india.in ని సందర్శించాలి.
➥ "For Prospects" విభాగానికి వెళ్లి, "Careers-All" పై క్లిక్ చేయాలి.
➥ ప్రొబేషనరీ ఇంజినీర్ రిక్రూట్‌మెంట్ లింక్ కోసం చూడాలి.
➥ ఈ పోస్టులకి అర్హులో కాదో నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.
➥ అభ్యర్థులు తమ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా నమోదు చేసుకోవాలి.
➥ అభ్యర్థులు వారికి సంబంధించిన పర్సనల్, ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫేషనల్ వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి.
➥ అభ్యర్థులు వారి ఫోటో, సిగ్నేచర్ అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్‌లతో పాటు అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి.
➥ అభ్యర్థులు వారీ కేటగిరీ ఆధారంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
➥ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దరఖాస్తు చేసిన తరువాత ప్రింటవుట్ తీసుకోవాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
జీతం: నెలకు రూ.40,000- రూ.1,40,000.
పని ప్రదేశాలు: మచిలీపట్నం- ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్- తెలంగాణ, చెన్నై- తమిళనాడు, బెంగళూరు, పూణె, ఘజియాబాద్, నేవీ ముంబయి, ఉత్తరాఖండ్, హరియాణా.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.01.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

