అన్వేషించండి

AFCAT 2 Notification 2024: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ 'ఏఎఫ్‌క్యాట్' నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రారంభం ఎప్పడంటే?

AFCAT 2024: భార‌త వైమానిక ద‌ళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ 02/2024 (AFCAT 02/2024) నోటిఫికేషన్ విడుద‌లైంది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 304 ఖాళీలను భర్తీచేయనున్నారు.

Indian Air Force AFCAT Notification: భార‌త వైమానిక ద‌ళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ 02/2024 (AFCAT 02/2024) నోటిఫికేషన్ విడుద‌లైంది. వైమానిక దళంలో టెక్నిక‌ల్‌ (Technical), నాన్ టెక్నిక‌ల్‌ (Non Technical) విభాగాల్లో 304 ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 30న ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులను వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. ఎంపికైనవారికి 2025 జులైలో కోర్సులు ప్రారంభంకానున్నాయి.

వివరాలు..

* ఏఎఫ్‌క్యాట్ -  AFCAT -  02/2024 

ఖాళీల సంఖ్య: 304 పోస్టులు

1) ఫ్లయింగ్ బ్రాంచ్: 29 (మెన్-18, ఉమెన్-11)

2) గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 156 (మెన్-124, ఉమెన్-32)

విభాగం: ఏరోనాటికల్ ఇంజినీరింగ్.

3) గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 119 (మెన్-95, ఉమెన్-24)

విభాగం: వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, ఎల్‌జీఎస్‌, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ. 

4) ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ

ఖాళీల సంఖ్య: సీడీఎస్ పరీక్ష నుంచి 10 శాతం, ఏఎఫ్‌క్యాట్ 2/2024 నుంచి 10 శాతం ఖాళీలను ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ కింద భర్తీచేస్తారు.

విభాగం: ఫ్లయింగ్ బ్రాంచ్.

అర్హత‌: 

🔰 ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు 60 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి. ఇంటర్ స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌లో 50 శాతం మార్కులు కచ్చితంగా ఉండాలి. (లేదా) 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ అర్హత ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

🔰 గ్రౌండ్ డ్యూటీ టెక్నిక‌ల్ పోస్టుల‌కు ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌(ఎల‌క్ట్రానిక్స్‌/మెకానిక‌ల్) విభాగాల్లో లేదా అనుంబంధ బ్రాంచీల్లో బీటెక్‌/బీఈ పూర్తి చేసి ఉండాలి. ఇంట‌ర్‌‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

🔰 గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నిక‌ల్) పోస్టుల్లో వివిధ విభాగాలను అనుసరించి ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత, ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా బీకాం/ బీఎస్సీ/ బీబీఏ/ సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్ఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

🔰 ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీకి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష ద్వారా 10 శాతం సీట్లను, ఏఎఫ్‌క్యాట్-2023 పరీక్ష ద్వారా 10 శాతం సీట్లను కేటయిస్తారు. 

వయోపరిమితి (01.07.2025 నాటికి):

🔰  ఫ్లయింగ్ బ్రాంచ్: 20 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.07.2001 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ ద్వారా కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందినవారికి 2 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. అంటే వయసు 26 సంవత్సరాలలోపు ఉండాలి. 02.07.1999 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. 

🔰 గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్ టెక్నికల్): 20 - 26 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1999 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.550. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ అభ్యర్థులకు ఫీజు ఉండదు. డెబిట్/ క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, చలానా రూపంలో ఫీజు చెల్లించవచ్చు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ & మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.

పేస్కేలు: శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ తర్వాత ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంకుతో రూ.1,77,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఉంటాయి. మిలిటరీ సర్వీస్ పేలో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి.

ముఖ్యమైన తేదీలు..

⏩ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.05.2024.

⏩ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.06.2024.

Website

AFCAT 2 Notification 2024: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ 'ఏఎఫ్‌క్యాట్' నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రారంభం ఎప్పడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget