అన్వేషించండి

AFCAT: ఆగస్టు 25 నుంచి 'ఏఎఫ్‌క్యాట్' రాతపరీక్ష, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

భార‌త వైమానిక ద‌ళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి 'ఏఎఫ్‌క్యాట్ 02/2023' పరీక్షను గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే నిర్వహించనున్నారు. ఆగస్టు 25 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

భార‌త వైమానిక ద‌ళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి 'ఏఎఫ్‌క్యాట్ 02/2023' పరీక్షను గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే నిర్వహించనున్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో టెక్నిక‌ల్‌, నాన్ టెక్నిక‌ల్‌ పోస్టుల భర్తీకి ఆగస్టు 25 నుంచి 27 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఏఎఫ్‌క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు షెడ్యూలును చూసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 276 ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి ఏఎఫ్‌క్యాట్ 02/2023 నోటిఫికేషన్ జూన్ 1న విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. వైమానిక దళంలో టెక్నిక‌ల్‌, నాన్ టెక్నిక‌ల్‌ విభాగాల ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి జూన్ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులను వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 1న ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

రాతపరీక్ష విధానం:

మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ & మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి.

పోస్టుల వివరాలు..

* ఏఎఫ్‌క్యాట్ -  AFCAT -  02/2023 

ఖాళీల సంఖ్య: 276

1) ఫ్లయింగ్ బ్రాంచ్: 11 (మెన్-05, ఉమెన్-06)

2) గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 151 (మెన్-136, ఉమెన్-15)

విభాగం: ఏరోనాటికల్ ఇంజినీరింగ్.

3) గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 114 (మెన్-99, ఉమెన్-15)

విభాగం: వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, ఎల్‌జీఎస్‌, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ. 

4) ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ

విభాగం: ఫ్లయింగ్ బ్రాంచ్.

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

AFCAT: ఆగస్టు 25 నుంచి 'ఏఎఫ్‌క్యాట్' రాతపరీక్ష, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

ALSO READ:

Staff Nurse Posts: స్టాఫ్‌నర్స్‌ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల
తెలంగాణలో స్టాఫ్‌నర్స్‌(Staff Nurse) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గమనిక. ఈ పరీక్షకు సమయం సమీపిస్తుండటంతో హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు(MHSRB) అధికారిక ‌వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఈ పోస్టులకు తొలిసారి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల అవగాహన కోసం MHSRB వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్‌ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 5,204 స్టాఫ్‌నర్సుల పోస్టుల కోసం 40,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 2న కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT)ను ‌హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ కేంద్రాల్లో మూడు షిఫ్ట్‌లలో ఉదయం 9 గంటల నుంచి 10.20 గంటల వరకు; 12.30-1.50గంటల వరకు; సాయంత్రం 4గంటల నుంచి 5.20గంటల వరకు నిర్వహించనున్నారు.
స్టాఫ్‌నర్స్‌ పరీక్ష హాల్‌టికెట్ కోసం క్లిక్ చేయండి..

1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
Embed widget