అన్వేషించండి

IBPS PO MT Recruitment: ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్

IBPS PO MT Recruitment: బ్యాంకింగ్ అభ్యర్థులకు ఐబీపీఎస్ గుడ్ న్యూ్స్ చెప్పింది. దేశవ్యాప్తంగా 6715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 21 లోపు అప్లై చేసుకోవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐబీపీఎస్ 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
  • డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 21, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

IBPS PO MT Recruitment: బ్యాంకు ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఐబీపీఎస్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,715 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు జులై 21, 2026 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు:

మొత్తం 6,715 పోస్టులలో ప్రధాన బ్యాంకుల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి. 

  • బ్యాంక్ ఆఫ్ బరోడా: 1,900 పోస్టులు
  • కెనరా బ్యాంక్: 1,500 పోస్టులు
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 1,100 పోస్టులు
  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 550 పోస్టులు
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్: 504 పోస్టులు
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా: 500 పోస్టులు 
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 500 పోస్టులు
  • పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: 161 పోస్టులు

అర్హతలు & వయోపరిమితి:

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 20 సంవత్సరాల నుండి గరిష్ఠంగా 30 సంవత్సరాల లోపు వయోపరిమితి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

జీతం 

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ప్రారంభంలోనే రూ.48,480 నుంచి రూ.85,920 వరకు బేసిక్ పే లభిస్తుంది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అదనంగా అందుతాయి.

ఎంపిక విధానం:

అభ్యర్థులను మొత్తం 5 దశలలో ఎంపిక చేస్తారు.  

1. ప్రిలిమినరీ పరీక్ష
2. మెయిన్స్ పరీక్ష
3. పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూ
4. సర్టిఫికెట్ వెరిఫికేషన్
5. మెడికల్ పరీక్ష

ఈ పరీక్షలలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. పరీక్షలు ఇంగ్లీష్, హిందీ మీడియంలో మాత్రమే నిర్వహిస్తారు. 

Also Read: కేంద్ర ఉద్యోగులకు శుభవార్త! 8th Pay Commission నివేదిక ఎప్పుడు వస్తుంది? జీతాల పెంపుపై అప్డేట్

ఎగ్జామ్ విధానం

1. ప్రిలిమినరీ పరీక్ష - మొత్తం మార్కులు: 100, సమయం: 60 నిమిషాలు 

  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 30 ప్రశ్నలు
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 35 ప్రశ్నలు
  • రీజనింగ్ ఎబిలిటీ – 35 ప్రశ్నలు

2. మెయిన్స్ పరీక్ష (మొత్తం మార్కులు: 200, టైమ్ : 2 గంటల 40 నిమిషాలు)

ఎగ్జామ్ ఫీజు 

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 850
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: రూ. 175

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జులై 1, 2026
  • దరఖాస్తుకు చివరి తేదీ: జులై 21, 2026
  • ప్రిలిమ్స్ పరీక్ష: ఆగస్టు 2026
  • ప్రిలిమ్స్ రిజల్ట్స్: సెప్టెంబర్/అక్టోబర్ 2026
  • మెయిన్స్ ఎగ్జామ్: అక్టోబర్/నవంబర్ 2026
  • ఇంటర్వ్యూ: నవంబర్/డిసెంబర్ 2026

అర్హులైన అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్(https://www.ibps.in/) ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.  
Also Read: గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2027 - టెక్ విద్యార్థులకు సువర్ణావకాశం.. దరఖాస్తుకు జూన్ 28 ఆఖరి తేదీ! - పూర్తి వివరాలు

Frequently Asked Questions

ఐబీపీఎస్ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది?

ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) మరియు మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,715 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు, వయోపరిమితి ఎంత?

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.

ఐబీపీఎస్ PO/MT పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు?

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జులై 21, 2026 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు జులై 1, 2026 నుండి ప్రారంభమయ్యాయి.

అభ్యర్థుల ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష అనే ఐదు దశలు ఉంటాయి. పరీక్షలు ఇంగ్లీష్, హిందీ మీడియంలో జరుగుతాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు రుసుము ఎంత?

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 175.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget