HAL Jobs: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 1,060 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
HAL Trade Apprentice 2023: బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
![HAL Jobs: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 1,060 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు HAL has released notification for the recruitment of Trade Apprentice Posts HAL Jobs: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 1,060 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/19/a78220b6837f345d8128d97505dcec941692440512824522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
HAL Trade Apprentice 2023: బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1,060 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతితో పాటు కర్ణాటక రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఐటీఐల నుంచి క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్(సీటీఎస్)లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 1.060.
* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ట్రేడ్స్: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సీవోపీఏ, ఫౌండ్రీ-మ్యాన్, షీట్ మెటల్ వర్కర్.
అర్హత: పదోతరగతితో పాటు కర్ణాటక రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఐటీఐల నుంచి క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్(సీటీఎస్)లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: నిబంధనల మేరకు.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి మార్కులు(70% వెయిటేజీ), సీటీఎస్ ఐటీఐ పరీక్ష(30% వెయిటేజీ) మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
టీటీఐ/ హెచ్‌ఏల్‌లో దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31.08.2023.
ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో 62 అకడమిక్ & నాన్-అకడమిక్ పోస్టులు
FDDI Recruitment: ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌డీడీఐ) అకడమిక్ & నాన్-అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 62 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్, గ్రాడ్యుయేషన్, బీకామ్, బీఏ, బ్యాచిలర్స్‌డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 63 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
BEL Recruitment: బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 63 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, బీకామ్, బీబీఎం, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నార్తర్న్ రైల్వేలో 93 సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కర్ణాటక బ్యాంక్‌లో పీవో పోస్టులు, ఎంపికైతే లక్ష రూపాయల జీతం
కర్ణాటక బ్యాంక్ దేశంలోని పలుశాఖలలో పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి పోస్టుల సంఖ్య ప్రకటించకపోయినప్పటికీ.. అవసరాన్ని బట్టి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో ఖాళీలను భర్తీ చేయనుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 26 చివరితేదీగా నిర్ణయించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)