(Source: ECI/ABP News/ABP Majha)
Exim Bank: ఎగ్జిమ్ బ్యాంకులో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు - నెలకు రూ.63,840 వరకు జీతం
Exim Bank Jobs: ముంబయిలోని ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
ముంబయిలోని ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 21 నుంచి నవంబరు 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 45
విభాగాలవారీగా ఖాళీలు..
➥ బ్యాంకింగ్ ఆపరేషన్స్: 35 పోస్టులు
➥ డిజిటల్ టెక్నాలజీ: 07 పోస్టులు
➥ రాజ్‌భాష: 02 పోస్టులు
➥ అడ్మినిస్ట్రేషన్: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.10.2023 నాటికి 21 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష విధానం..
➥ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో, 100 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఆబ్జెక్టివ్ పరీక్ష కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తారు. డిస్క్రిప్టివ్ పరీక్ష ఆధారంగానే అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
➥ ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్షలో రీజనింగ్ & క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-20 ప్రశ్నలు-20 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్/ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్)-20 ప్రశ్నలు-20 మార్కులు, డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రిటేష్-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 80 నిమిషాలు.
➥ డిస్క్రిప్టివ్ పరీక్షలో ఇంగ్లిష్ పేపర్‌కు 25 మార్కులు (ఎస్సే-15 మార్కులు, లెటర్ రైటింగ్-10 మార్కులు) ఉంటాయి. ఇక అభ్యర్థి ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 75 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 100 నిమిషాలు.
జీతభత్యాలు: నెలకు రూ.36,000 - రూ.63,840 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం21.10.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.11.2023.
➥ ఆన్‌లైన్ పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్ 2023.
ALSO READ:
ఆప్కాబ్‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతం
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..