DMHO: చిత్తూరు డీఎంహెచ్‌వోలో 54 ఉద్యోగాలు, అక్టోబరు 17న తుది ఎంపిక జాబితా వెల్లడి
చిత్తూరు మెడికల్ హెల్త్ ఆఫీసర్ విభాగం జిల్లాలోని పలు ఆరోగ్యకేంద్రాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తుది ఎంపిక జాబితాను అక్టోబరు 17న విడుదల చేయనున్నారు.
చిత్తూరు జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ విభాగం జిల్లాలోని పలు ఆరోగ్యకేంద్రాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఎంపిక జాబితాను అక్టోబరు 17న విడుదల చేయనున్నారు. ఎంపికైనవారికి అక్టోబరు 23న కౌన్సెలింగ్ నిర్వహించి, నియామక పత్రాలు ఇవ్వనున్నారు.
చిత్తూరు జిల్లా వైద్యారోగ్య శాఖలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ తదితర 54 ఉద్యోగాలు భర్తీకి సంబంధించి అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 25 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబరు 6న దరఖాస్తు పరిశీలన నిర్వహించి అక్టోబరు 12న ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల చేశారు. అక్టోబరు 13న జాబితాపై అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అక్టోబరు 17న తుది జాబితాను విడుదల చేయనున్నారు.
వివరాలు..
ఖాళీల వివరాలు: 54 పోస్టులు
1) మెడికల్ ఆఫీసర్: 11 పోస్టులు
అర్హత: ఎండీ(మెడిసిన్)/ఎంబీబీఎస్.
2) స్టాఫ్ నర్స్: 31 పోస్టులు
అర్హత: జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్.
3) ఫిజియోథెరపిస్ట్: 01 పోస్టులు
అర్హత: బీపీటీ.
4) మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్: 03 పోస్టులు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత.
5) ల్యాబ్ టెక్నీషియన్: 04 పోస్టులు
అర్హత: డీఎంఎల్‌టీ (లేదా) బీఎఎస్సీ (ఎంఎల్‌టీ)
6) ఫార్మసిస్ట్: 02 పోస్టులు
అర్హత: బీఫార్మసీ/డీఫార్మసీ/ఎంఫార్మసీ
7) లాస్ట్ గ్రేడ్ సర్వీస్: 01 పోస్టులు
అర్హత: పదోతరగతి.
8) డేటా మేనేజర్: 01 పోస్టులు
అర్హత: పీజీ డిగ్రీ.
వయోపరిమితి: 01.04.2023 నాటికి 42 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అర్హతలు, రిజర్వేషన్ల ఆధారంగా.
జీతం: మెడికల్ ఆఫీసర్-రూ.53,495; స్టాఫ్ నర్స్-రూ.22,500; ఫిజియోథెరపిస్ట్-రూ.30,387; మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్-రూ.27,000; ల్యాబ్ టెక్నీషియన్-రూ.19,019; ఫార్మసిస్ట్-రూ.19,019; లాస్ట్ గ్రేడ్ సర్వీస్-రూ.12,000; డేటా మేనేజర్-రూ.36,225.
Notification:
ALSO READ:
విజయనగరం జిల్లా డీసీహెచ్‌ఎస్‌లో జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
విజయనగరంలోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్‌ఎస్), డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ(ఆడియాలజీ), డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 25లోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. పూర్తివివరాలకు నోటిఫికేషన్ చూడవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కృష్ణా జిల్లాలో 54 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టులు, వివరాలు ఇలా
మచిలీపట్నంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబరు 20లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
అనంతపురం జిల్లాలో 56 పారామెడికల్ పోస్టులు, వివరాలు ఇలా
అనంతపురంలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబరు 21లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..