CTET 2022: సీటెట్ దరఖాస్తుల సవరణకు అవకాశం, తప్పులుంటే సరిదిద్దుకోండి - డిసెంబరు 3 వరకు అవకాశం!
కేంద్రీయ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే 'సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్)-2022' దరఖాస్తుల సవరణకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అవకాశం కల్పించింది.
కేంద్రీయ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే 'సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్)-2022' దరఖాస్తుల సవరణకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అవకాశం కల్పించింది. నవంబరు 28న అప్లికేషన్ కరెక్షన్ విండో అందుబాటులోకి వచ్చింది. సీటెట్ దరఖాస్తుల సమయంలో వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు డిసెంబరు 3లోగా వివరాలు సవరించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక లింక్‌ను సీబీఎస్‌ఈ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు తమ సీటెట్ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్, ఇతర అవసరమైన వివరాలు నమోదుచేసి తమ వివరాలను సవరించుకోవచ్చు.
సీటెట్ దరఖాస్తుల సవరణ కోసం క్లిక్ చేయండి...
'సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్) - 2022' నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అక్టోబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 31న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి అక్టోబర్ 31 నుంచి నవంబర్ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఫీజు చెల్లించడానికి నవంబరు 25 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500), రెండు పేపర్లకు అయితే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించారు. డిసెంబరు 2022 - జవవరి 2023 మధ్య సీటెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఈ పరీక్షను ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. సీటెట్ స్కోరుకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావొచ్చు. 20 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
సీటెట్ స్కోరు ఉన్న వారు ఆయా రాష్ట్రాలు నిర్వహించే టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను విధిగా రాయాల్సిన అవసరం లేదు. సీటెట్ స్కోరుతో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, కేంద్ర స్థాయి విద్యా సంస్థల్లో అంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష విధానం..
✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
సీటెట్ నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 411 ఎస్‌ఐ పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న, ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
కరెన్సీ నోట్ ప్రెస్‌లో 125 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
నాసిక్ (మహారాష్ట్ర)లోని కరెన్సీ నోట్ ప్రెస్ సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్), బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, మెరిట్‌లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 26 నుంచి డిసెంబరు 16 వరకు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ జనవరి/ఫిబ్రవరి 2023 లేదా అభ్యర్థుల సంఖ్యను బట్టి పరీక్ష తేదీలను పొడిగించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...