CBSE CTET 2022: సీటెట్-2022 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500), రెండు పేపర్లకు అయితే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. సీటెట్ ఆన్‌లైన్ టెస్టును డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి మధ్య నిర్వహించనున్నారు.
కేంద్రీయ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే 'సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్)-2022' దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 31న ప్రారంభమైన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు నవంబర్ 24తో ముగియనుంది. అయితే ఫీజు చెల్లించడానికి నవంబరు 25 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500), రెండు పేపర్లకు అయితే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. సీటెట్ ఆన్‌లైన్ టెస్టును డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి మధ్య నిర్వహించనున్నారు.
'సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సీటెట్) - 2022' నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అక్టోబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఈ పరీక్షను ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. సీటెట్ స్కోరుకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావొచ్చు. 20 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
సీటెట్ స్కోరు ఉన్న వారు ఆయా రాష్ట్రాలు నిర్వహించే టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను విధిగా రాయాల్సిన అవసరం లేదు. సీటెట్ స్కోరుతో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, కేంద్ర స్థాయి విద్యా సంస్థల్లో అంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వివరాలు..
✪ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబరు -2022
✦ ప్రైమరీ స్టేజ్ (1 నుంచి 5 తరగతులకు బోధించడానికి) (పేపర్-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు అయిదు శాతం మేర మార్కుల్లో సడలింపు ఉంటుంది.
✦ ఎలిమెంటరీ స్టేజ్ (6 నుంచి 8 తరగతులకు బోధించడానికి) (పేపర్ 2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
Also Read: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 రూ.1000 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 కు రూ.500; రెండు పేపర్లకు అయితే రూ.600 చెల్లించాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.
పరీక్ష విధానం..
✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
✦ పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
Also Read: DRDO'లో 1061 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ఈ అర్హతలు ఉండాలి!
ముఖ్యమైన తేదీలు...
✦ సీటెట్ డిసెంబరు 2022 నోటిఫికేషన్ వెల్లడి: 20.10.2022.
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.10.2022.
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.11.2022.
✦ ఫీజు చెల్లించడానికి చివరితేది: 25.11.2022.
✦ పరీక్ష తేదీ: డిసెంబరు 2022 - జవవరి 2023 మధ్య.
Also Read:
జిల్లా కోర్టుల్లో 3432 ఉద్యోగాల భర్తీ, అభ్యర్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూలు వెల్లడి!
ఏపీలోని జిల్లా కోర్టుల్లో 3432 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూలును నవంబరు 23న ఏపీ హైకోర్టు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష పోస్టులవారీగా పరీక్షల తేదీలను చూసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 21న ప్రారంభమయ్యే పరీక్షలు జనవరి 2తో ముగియనున్నాయి. పోస్టుల ఆధారంగా తగినన్ని షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పేపర్-2 పరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?
కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి నిర్వహించినున్న పేపర్-2 ఎగ్జామినేషన్ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 23న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 11న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన 3,224 మంది అభ్యర్థులు పేపర్-2 పరీక్ష రాయడానికి అర్హులు. వాస్తవానికి డిసెంబరు 4న పరీక్ష నిర్వహించాలని మొదట భావించారు. కానీ డిసెంబరు 11న నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
నోటిఫికేషన్, పరీక్ష తేదీ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.