CRPF Admit Cards: సీఆర్‌పీఎఫ్ పారామెడికల్ స్టాఫ్ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 27, 28 తేదీల్లో సీబీటీ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 27న సా. 4 గం. - 6 గం. వరకు, మార్చి 28న ఉ. 8.30 గం. నుంచి 10.30 గం. వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్ (టెక్నికల్) పారామెడికల్ పోస్టుల పరీక్ష అడ్మిట్ కార్డులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రూల్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ను అభ్యర్థుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు SMS ద్వారా కూడా చేరవేస్తారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 27, 28 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 27న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, మార్చి 28న ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
సీఆర్‌పీఎఫ్ పారామెడికల్ స్టాఫ్ అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి...
Step 1: అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - https://crpf.gov.in/
Step 2: అక్కడ హోంపేజీలో ''Link to download the admit card for the exam of Paramedic Staff'' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ (పుట్టినతేదీ) వివరాలు నమోదుచేయాలి.
Step 4: వివరాలు సరిచూసుకొని 'Login' బటన్‌పై క్లిక్ చేయాలి.
Step 5: అభ్యర్థుల అడ్మిట్ కార్డులు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శనమిస్తుంది.
Step 6: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Step 7: అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకోవాలి. కలర్ ప్రింట్ తీసుకోవడం మంచి.
సీఆర్‌పీఎఫ్ పారామెడికల్ స్టాఫ్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్ పారామెడికల్ స్టాఫ్ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రెండు కలర్ ప్రింట్ అడ్మిట్ కార్డులను, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లా్ల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల్లోని అభ్యర్థుల వివరాల్లో ఏమైనా తేడా ఉంటే, వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. అభ్యర్థులు Office of DIGP, GC, CRPF, Bhopal లేదా ఫోన్: 07480-292518 ద్వారా సందేహాలు పరిష్కరించుకోవచ్చు.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 250 పారామెడికల్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడైన సంగతి తెలిసిందే. వీటిలో మసాల్చీ్-04, కుక్-116, సఫాయ్ కర్మచారి-121, వాషర్‌మ్యాన్-05, వాటర్ క్యారియర్-03, టేబుల్ బాయ్-01 పోస్టులు ఉన్నాయి.
పరీక్ష విధానం:
➥ మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, సెక్షన్-బి) నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు.
➥ వీటిలో సెక్షన్-ఎలో 50 ప్రశ్నలకుగాను.. జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 10 ప్రశ్నలు-10 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 15 ప్రశ్నలు-15 మార్కులు, ఇంగ్లిష్/హిందీ కాంప్రహెన్షన్ 15 ప్రశ్నలు-15 మార్కులు ఉంటాయి.
➥ ఇక సెక్షన్-బిలో అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు నుంచి 50 పశ్నలు-50 మార్కులు ఉంటాయి.
ALso Read:
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..