అన్వేషించండి

CRPF Exam: సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్(ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల భర్తీకి సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 26న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు.

సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్(ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల భర్తీకి సంబంధించిన అడ్మిట్ కార్డులను 'సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్' జూన్ 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీకార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జులై 1 నుంచి 12 వరకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 1 నుంచి 3 వరకు మొదటి సెషన్‌లో; జులై 4, 5 తేదీల్లో రెండో సెషన్‌లో; జులై 6, 10, 11, 12 తేదీల్లో మూడో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

కానిస్టేబుల్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి.. 

దేశవ్యాప్తంగా మొత్తం 9,212 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల భర్తీకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాళీలకు అదనంగా మరో 148 పోస్టులను చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 9,360కు చేరింది. మార్చి 27 నుంచి మే 2 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు జులై 1 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించాలని సీఆర్‌పీఎఫ్ నిర్ణయించింది. 

Also Read: కానిస్టేబుల్‌ పోస్టులు పెరిగాయోచ్! 9,360కు చేరిన ఖాళీల సంఖ్య!

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కుల్కు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో హిందీ/ ఇంగ్లిష్ లాంగ్వేజ్- 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్- 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్‌నెస్- 25 ప్రశ్నలు-25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథ్స్- 25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. 

Also Read: 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఎఫ్‌ కానిస్టేబుల్ పరీక్ష, పూర్తివివరాలు ఇలా!

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్, ఆదిలాబాద్.

ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపుం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ALSO READ:

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జులై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(టీహెచ్‌డీసీ) జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. జూన్ 9 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ వైవా ద్వారా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Happy Birthday Rajinikanth: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
Crime News: హైదరాబాద్‌లో భారీ దోపిడీ - ఇంట్లోకి చొరబడి 2.5 కిలోల బంగారం అపహరణ
హైదరాబాద్‌లో భారీ దోపిడీ - ఇంట్లోకి చొరబడి 2.5 కిలోల బంగారం అపహరణ
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Embed widget