BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు, వివరాలు ఇవే!
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
![BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు, వివరాలు ఇవే! BEL has released notification for thr recruitment of Trainee Engineer posts, apply here BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు, వివరాలు ఇవే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/bce48aa9ee56b34b16107efebcbf74191670329243593522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఎస్సీ(ఇంజినీరింగ్), బీఈ, బీటెక్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 21 లోగా దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
ట్రైనీ ఇంజినీర్-1
మొత్తం ఖాళీలు: 09
అర్హత: బీఎస్సీ(ఇంజినీరింగ్), బీఈ, బీటెక్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.35 వేలు, మూడో ఏడాది రూ.40 వేలు వేతనం లభిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులను పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తు ఫీజు: రూ.177. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 21.12.2022.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Sr. DGM(HR/COMPS & EM),
Bharat Electronics Limited,
Jalahalli Post, Bengaluru -560013.
Also Read:
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 213 ఉద్యోగాలు, వివరాలు ఇవే!
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా జేవో&జేఎస్, సిర్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి డిప్లొమా(మైనింగ్/ మైనింగ్ ఇంజినీరింగ్/ మైన్ సర్వేయింగ్)/ డిగ్రీ(సివిల్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
KVS Recruitment: కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల మేళా, 13404 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల!
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, మెరిట్ & రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)