News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా ఏవో ఉద్యోగాల హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో అక్విజిషన్‌ ఆఫీసర్‌ (ఏవో) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష అడ్మిట్‌ కార్డులు సెప్టెంబరు 27న విడుదలయ్యాయి. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

FOLLOW US: 
Share:

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో అక్విజిషన్‌ ఆఫీసర్‌ (ఏవో) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్ష అడ్మిట్‌ కార్డులు సెప్టెంబరు 27న విడుదలయ్యాయి. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఏవో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రూల్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ నమోదు చేసి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌ 1న ఎంపికచేసిన కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.

దేశవ్యాప్తంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖల్లో 500 అక్విజిషన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ రాత పరీక్షలు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

ఎస్‌బీఐలో 2000 పీవో పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
భారతదేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు సెప్టెంబరు 7న ప్రారంభమైంది. కాగా.. దరఖాస్తు గడువు సెప్టెంబరు  27తో ముగియాల్సి ఉండగా.. అక్టోబరు 3 వరకు పొడిగించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
పీవో పోస్టుల దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎయిమ్స్‌-కళ్యాణిలో 120 గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టులు - వివరాలు ఇలా
పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను  భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్‌ 10లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 28 Sep 2023 06:28 AM (IST) Tags: Bank of Baroda AO Recruitment BOB Recruitment 2023 Bank of Baroda Acquisition Officer Recruitment Bank of Baroda AO Exam Admit Card BOB AO Hallticket

ఇవి కూడా చూడండి

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

APPSC Group-1:  ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!

Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!