Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 161 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్‌లో గ్రూప్-బి, గ్రూప్-సి టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి డిసెంబరులో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి డిసెంబరు నెలలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు అక్టోబరు 21 నుంచి నవంబరు 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు డిసెంబరు 18 నుంచి ప్రారంభమయ్యే ర్యాలీలో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
వివరాలు..
* టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ-2024 (గ్రూప్-బి, సి పోస్టులు)
పోస్టుల సంఖ్య: 161 పోస్టులు (ఆంధ్రప్రదేశ్-08; తెలంగాణ-04)
ట్రేడులు:
➥ బ్రిడ్జి అండ్ రోడ్ (మెన్, ఉమెన్): 26
➥ రిలీజియస్ టీచర్ (మెన్): 04
➥ ఎలక్ట్రికల్ & మెకానికల్: 30
➥ పర్సనల్ అసిస్టెంట్ (మెన్, ఉమెన్): 14
➥ లైన్‌మ్యాన్ ఫీల్డ్(మెన్): 19
➥ రికవరీ వెహికిల్ మెకానిక్: 24
➥ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెన్, ఉమెన్): 12
➥ ప్లంబర్: 14
➥ సర్వే ఐటీఐ: 04
➥ ఎక్స్-రే అసిస్టెంట్: 14
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు (ఎత్తు, ఛాతీ) కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.08.2023 నాటికి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.08.2000 - 01.08.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: గ్రూప్-బికి రూ.200; గ్రూప్-సికి రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 21.10.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 19.11.2023.
➥ ర్యాలీ ప్రారంభం: 18.12.2023 నుంచి.
Notification
ↆ
ALSO READ:
శ్రీహరికోట-సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఎస్డీఎస్సీ షార్ సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నెలకు రూ.79,662 జీతంగా ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 650 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..