AP Constable Hall Tickets: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, తుది పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్
APSLPRB: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న తుది పరీక్ష హాల్‌టికెట్లను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న తుది పరీక్ష నిర్వహించనున్నారు.

AP Constable Admit Cards: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న తుది పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పోలీసు నియామక మండలి అధికారికి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఫైనల్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ పుట్టినతేదీ, రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తికాగా.. జూన్ 1న కానిస్టేబుల్ అభ్యర్థులకు తుది పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన 95,208 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాయనున్నారు. విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేయనున్నారు. మెయిన్స్ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఒకే పేపర్‌గా ఉంటుంది.
కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లాలి- slprb.ap.gov.in.
➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Recruitment' పేజీలోకి వెళ్లాలి.
➥ అక్కడ కనిపించే 'SCT PC (CIVIL) (MEN & WOMEN), SCT PC (APSP) MEN admit card' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఆ తర్వాత వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు సమర్పించాలి.
➥ స్క్రీన్ మీద అభ్యర్థి, పరీక్ష వివరాలతో కూడిన హాల్‌టికెట్ దర్శనమిస్తుంది.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసకొని, ప్రింట్ తీసుకోవాలి.
➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ వెంటతీసుకురావాలి. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును తీసుకెళ్లాలి.
కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 నగరాలు, పట్టణాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 4,58,219 మంది మాత్రమే అంటే 91 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 45,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తదుపరి దశకు మొత్తం 95,209 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు.
🔰 మెయిన్ పరీక్ష విధానం:
➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
➨ సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
➨ ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.
కానిస్టేబుల్ పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..





















