APSLPRB Police Recruitment: కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు - చివరితేది ఎప్పుడంటే?
కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 28 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. జనవరి 7 వరకు పొడిగిస్తూ పోలీసు నియామక మండలి నిర్ణయించింది.
ఏపీలో 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 411 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 28 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే అభ్యర్థుల సౌలభ్యం కోసం దరఖాస్తు గడువును జనవరి 7 వరకు పొడిగిస్తూ పోలీసు నియామక మండలి నిర్ణయం తీసుకుంది.
కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జనవరి 9 నుంచి అందుబాటులో ఉంచునన్నట్లు ముందుగా ప్రకటించినప్పటికీ.. దరఖాస్తు గడువును జనవరి 7 వరకు పొడిగించడంతో.. పరీక్షలకు 10 రోజుల ముందునుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.
ఇక 411 ఎస్‌ఐ పోస్టులకు సంబంధించి డిసెంబరు 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 18 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ప్రిలిమినరీ రాతపరీక్షను ఫిబ్రవరి 19న నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులో ఉండునున్నాయి.
➨ పోస్టుల వివరాలు..
పోలీస్ కానిస్టేబుల్స్: 6,100 పోస్టులు
పోలీస్ కానిస్టేబుల్(సివిల్-మెన్ & ఉమెన్) | 3580 పోస్టులు |
పోలీస్ కానిస్టేబుల్స్ (APSP-మెన్) | 2520 పోస్టులు |
🔰 ప్రిలిమినరీ పరీక్ష విధానం:
➨ ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
➨ పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.
➨ ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష ఉంటుంది.
➨ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.
➨ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు.
➨ అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు
🔰 మెయిన్ పరీక్ష విధానం:
➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
➨ సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
➨ ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.
🔰 ఫిజికల్ ఈవెంట్లు ఇలా..
➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
Also Read:
13,404 ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 26తో దరఖాస్తు గడువు ముగియనుంది.
ఉద్యోగాల దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...