News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

APPSC AEE APPLICATION EDIT: ఏఈఈ పోస్టుల దరఖాస్తుల సవరణకు అవకాశం, తప్పులుంటే సరిదిద్దుకోండి!

దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి నవంబరు 16న కరెక్షన్ విండోను అందుబాటులో ఉంచారు. నవంబరు 18 వరకు వివరాలు సవరించుకోవడానికి అవకాశం కల్పించారు.

FOLLOW US: 
Share:

ఏపీలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏఈఈ పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 26 నుంచి నవంబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి నవంబరు 16న కరెక్షన్ విండోను అందుబాటులో ఉంచారు. నవంబరు 18 వరకు వివరాలు సవరించుకోవడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తు వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

దరఖాస్తుల సవరణ కోసం క్లిక్ చేయండి..

ఒకేసారి అవకాశం..

⏩ దరఖాస్తుల సవరణకు ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పిస్తారు. అందుకే తమ వివరాలను సవరించుకోవాలనుకునే అభ్యర్థులు జాగ్రత్తగా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది.

⏩ అభ్యర్థులు తమ బయోడేటా వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి. తప్పుగా నమోదుచేసిన వివరాలను గుర్తించాలి.

⏩ వివరాలను సరిచేసుకున్నాక, దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

⏩ బయోడేటా వివరాలను మార్చుకునే అభ్యర్థులు పేరు, జెండర్, పుట్టినతేది వివరాలకు సంబంధించిన సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు..

* అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)

ఖాళీల సంఖ్య: 23

జోన్లవారీగా పోస్టుల కేటాయింపు: జోన్ 1-09, జోన్ 2-05, జోన్ 3-04, జోన్ 4-05.

విభాగాల వారీగా ఖాళీలు: 

1) ఏపీ రూరల్ వాటర్ సప్లయ్ & శానిటేషన్ ఇంజినీరింగ్ సర్వీస్ (సివిల్): 13 పోస్టులు 

2) రోడ్స్ & బిల్డింగ్స్ ఇంజినీరింగ్ సర్వీస్ (సివిల్): 03 పోస్టులు 

3) ఏపీ వాటర్ రిసోర్సెస్ సర్వీస్ (సివిల్ & మెకానికల్): 05 

4) ఏపీ పంచాయత్‌రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ సర్వీస్ (సివిల్): 02 

అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, NCC (ఇన్‌స్ట్రక్టర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, మెడికల్ ఫిట్‌‌నెస్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా, రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, తెల్లరేషన్ కార్డు దారులకు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

రాతపరీక్ష విధానం:

✒ మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1: 150 మార్కులు, పేపర్-2: 150 మార్కులు, పేపర్-2: 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

✒ పేపర్-1లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో అభ్యర్థి సబ్జెక్టులకు (సివిల్ & మెకానికల్) సంబంధించిన అంశాల నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఇక పేపర్-3లో (సివిల్/మెకానికల్) సబ్జెక్టులకు సంబంధించిన అంశాల నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.

✒ ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 1/3 వంతు మేర కోత విధిస్తారు. 

పరీక్షలో అర్హత మార్కులు: జనరల్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించారు. అదేవిధంగా బీసీలకు 35 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు. 

జీతం: నెలకు రూ.57,100 – రూ.1,47,760

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.10.2022.

ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.11.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.11.2022.

Notification

Website

Also Read:

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ దరఖాస్తు ప్రారంభం - అర్హత, ఎంపిక వివరాలివే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు 2న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 21లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, నవంబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తు, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 16 Nov 2022 06:36 PM (IST) Tags: APPSC Recruitment 2022 APPSC Notifications APPSC AEE Recruitment APPSC AEE Application Window APPSC AEE Application Correction

ఇవి కూడా చూడండి

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్‌-2 పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్‌-2 పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?

CSIR UGC NET 2023:  సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?

RRC: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

RRC: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

IPR Recruitment: ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

IPR Recruitment: ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి

AP High Court: ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?

AP High Court: ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి