By: ABP Desam | Updated at : 28 Jan 2023 06:55 AM (IST)
Edited By: omeprakash
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు
ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష ఫలితాలు జనవరి 27న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఏపీపీఎస్సీ ఎంపికచేసింది. ఈ మేరకు ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 6,455 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వీరికి ఏప్రిల్ 23 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా తేదీల్లో ఉదయం సెషన్లలోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది.
'గ్రూప్-1' ప్రిలిమ్స్ ఫలితాలు, ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి..
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు ఇలా..
మెయిన్ పరీక్షలో మొత్తం 5 పేపర్లు ఉంటాయి. మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఒక్కో పేపరుకు 150 మార్కుల కేటాయించారు. మొత్తం 5 పేపర్లకు గాను 750 మార్కులు, పర్సనాలిటీ టెస్టుకు 75 మార్కులు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలను కేవలం అర్హత పరీక్షలుగానే పరిగణిస్తారు. వీటిమార్కులను మెయిన్స్ పరీక్ష మార్కుల్లో కలపరు.
➥ ఏప్రిల్ 23: తెలుగు పేపర్ (అర్హత పరీక్ష మాత్రమే): 150 మార్కులు
➥ ఏప్రిల్ 24: ఇంగ్లిష్ పేపర్ (అర్హత పరీక్ష మాత్రమే): 150 మార్కులు
➥ ఏప్రిల్ 25: పేపర్-1 జనరల్ ఎస్సే (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన సమస్యలు: 150 మార్కులు
➥ ఏప్రిల్ 26: పేపర్-2 (హిస్టరీ & కల్చరల్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా & ఏపీ): 150 మార్కులు
➥ ఏప్రిల్ 27: పేపర్-3 (పాలిటీ, రాజ్యాంగం, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు.
➥ ఏప్రిల్ 28: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా & ఏపీ): 150 మార్కులు
➥ ఏప్రిల్ 29: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు
పరీక్ష స్వరూపం, సిలబస్ వివరాలు...
ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష జనవరి 8న ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఇవీ చదవండి..
నేవీలో ఉచితంగా 'ఇంజినీరింగ్' విద్య, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం!
ఇండియన్ నేవీ - 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా బీటెక్ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి 2023 జులైలో శిక్షణ ప్రారంభమవుతుంది. వీరు ఎజిమల నేవల్ అకాడమీ(కేరళ)లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంతరం నేవీలోనే ఉన్నత హోదాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. జనవరి 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఇండియన్ నేవీలో స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సు జూన్-2023 ద్వారా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి, వివరాలు ఇలా!
TS Police SI Admit Card: ఎస్సీటీ ఎస్ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే
IITTM Jobs: ఐఐటీటీఎం- టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్ లీకేజీకి స్కెచ్!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా