అన్వేషించండి

APPSC: గ్రూప్‌-1 మార్కుల వెల్లడి విధానంలో మార్పులు, ఆంక్షలు తీసుకొచ్చిన ఏపీపీఎస్సీ

గ్రూప్‌-1 మార్కుల వెల్లడి విధానంలో ఏపీపీఎస్సీ మార్పులు చేసింది. 2022 నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికంటే ఏడు నెలలు ఆలస్యంగా, అదీ దరఖాస్తు చేసిన వారికే మార్కులు తెలియజేస్తామని ఆంక్షలు విధించింది.

APPSC Group1 Marks: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మార్కుల వెల్లడి విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. 2022 నోటిఫికేషన్‌లో పేర్కొన్న దాని కంటే ఏడు నెలలు ఆలస్యంగా, అదీ దరఖాస్తు చేసిన వారికే మార్కులు తెలియజేస్తామని ఆంక్షలు విధించింది. ఏపీపీఎస్సీ ప్రకటనపై విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో వారం రోజుల్లో తామే మార్కుల మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులోనికి తెస్తామని మార్చి 21న ఒక ప్రకటనలో పేర్కొంది. ఎవరూ దరఖాస్తు చేయక్కర్లేదని సూచించింది. అభ్యర్థులు వన్‌టైం ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌) ఆధారంగా మాత్రమే మార్కుల మెమొరాండంలోని వివరాలు తెలుసుకోవచ్చునని షరతు పెట్టింది. ఈ విధానంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులు అందరికీ తెలిసే అవకాశం లేదు.

APPSC: గ్రూప్‌-1 మార్కుల వెల్లడి విధానంలో మార్పులు, ఆంక్షలు తీసుకొచ్చిన ఏపీపీఎస్సీ

యూపీఎస్సీలో కమ్యూనిటీ, సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను వెల్లడిస్తున్నారు. ఏపీపీఎస్సీ కూడా 2016 నోటిఫికేషన్ వరకు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించింది. 2018 నోటిఫికేషన్‌పై కోర్టు విచారణను అడ్డం పెట్టుకుని ఏపీపీఎస్సీ మార్కుల వెల్లడి సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. 2022 గ్రూప్-1 నోటిఫికేషన్‌లో ఎంపిక జాబితా వెల్లడి జరిగిన నెలరోజుల తర్వాత.. కోరినవారికి మార్కుల మెమొరాండం అందిస్తామని పేర్కొన్నా, అలా చేయలేదు. మార్కులు వెల్లడించకపోవడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మార్చి 19న ఏపీపీఎస్సీ గుట్టుచప్పుడు కాకుండా వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన పెట్టింది. మార్కుల మెమొరాండం అవసరమైనవారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేస్తే, రెండు వారాల తర్వాత వారికి వచ్చిన మార్కులను లాగిన్ విధానంలో తెలుసుకునే అవకాశం కల్పిస్తామని అందులో వెల్లడించింది.

APPSC: గ్రూప్‌-1 మార్కుల వెల్లడి విధానంలో మార్పులు, ఆంక్షలు తీసుకొచ్చిన ఏపీపీఎస్సీ

అభ్యర్థులకు రాత, మౌఖిక పరీక్షల్లో తమ మార్కుల గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఇవి తెలిస్తేనే పోటీలో తాము ఎక్కడున్నామో.. ఎక్కడ వెనుకబడ్డామో తెలుసుకుని భవిష్యత్తులో జాగ్రత్తపడగలరు. అందుకే యూపీఎస్సీ ఈ మార్కులను అభ్యర్థులకు తెలియబరుస్తుంది. కానీ ఏపీపీఎస్సీ మాత్రం మార్కుల వెల్లడిపై ఆంక్షలు పెట్టడం చర్చనీయాంశమైంది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్‌లోనే ప్రిలిమ్స్ ప్రాథమిక కీ వెల్లడి అనంతరం అభ్యర్థులకు వచ్చిన మార్కులతో కూడిన మొత్తం జాబితాను ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. ప్రత్యేకంగా మెమొరాండం ఉండదని తెలిపింది. కానీ.. ఈ నోటిఫికేషన్ ద్వారా నియామకాల్లో ఎంపికైన, మౌఖిక పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలు ఇంతవరకు చెప్పలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగినవారికి కోర్టు కేసు ఉందని కమిషన్ సమాధానమిస్తోంది.

ఏపీపీఎస్సీ 36/2016 గ్రూప్-1 నోటిఫికేషన్‌ను అనుసరించి... ప్రధాన పరీక్షలు ముగిశాక అభ్యర్థులకు వచ్చిన మార్కులను జాబితా రూపంలో ప్రకటించింది. అందులో అభ్యర్థుల రోల్ నెంబరు, కమ్యూనిటీ, ఒక్కో సబ్జెక్టులో 150కి వచ్చిన మార్కుల వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. 2011 గ్రూప్-1 నోటిఫికేషన్‌లోనూ ఇదే విధానాన్ని అనుసరించింది. నిరుద్యోగులకు సానుకూలంగా ఉన్న ఈ సంప్రదాయాన్ని కొనసాగించకుండా లేనిపోని ఆంక్షలతో పరిమితం చేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

3 నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాలి..
గ్రూప్-1 (28/2022) నోటిఫికేషన్ అనుసరించి మార్కుల మెమొరాండం అవసరమైనవారు మార్చి 22 నుంచి జూన్ 21లోగా కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి అందిన రెండు వారాల తర్వాత మార్కుల మెమొరాండాన్ని లాగిన్ విధానంలో తెలుసుకోవచ్చునని పేర్కొంది. ఇందుకు తొలుత ప్రకటించినట్లు రూ.200 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
2018 గ్రూప్‌-1 మెయిన్స్ రద్దు తీర్పు సస్పెండ్‌ చేసిన హైకోర్టు..

హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. 2018 గ్రూప్‌ వన్‌ మెయిన్స్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఇప్పటి వరకు ఎంపికైన ఉద్యోగులు విధుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. తదపరి విచారణ వారానికి వాయిదా వేసింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Danam Nagender: కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
YS Sharmila: ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
BRS Meeting In Warangal: వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్
పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs RR Match preview IPL 2025 | నేడు బెంగుళూరులో రాజస్థాన్ రాయల్స్ తో RCB ఫైట్ | ABP DesamRohit Sharma 70 Runs vs SRH IPL 2025 | సరైన సమయంలో బీభత్సమైన ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ | ABP DesamMumbai Indians top 3 Position IPL 2025 | అనూహ్య రీతిలో పాయింట్స్ టేబుల్ లో దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్ | ABP DesamIshan Kishan Match Fixing Trending IPL 2025 | తీవ్ర వివాదమవుతున్న ఇషాన్ కిషన్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Danam Nagender: కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
YS Sharmila: ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
BRS Meeting In Warangal: వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్
పైరవీ చేస్తే సీరియస్ యాక్షన్- పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా పవన్ వార్నింగ్
Encounter in Karregutta: తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
Rajamouli: మహేష్ బాబు సినిమా కోసం... ఆర్దీవో ఆఫీసుకు రాజమౌళి... విదేశాల్లో జక్కన్నకు డ్రైవర్ అవసరం లేదా?
మహేష్ బాబు సినిమా కోసం... ఆర్దీవో ఆఫీసుకు రాజమౌళి... విదేశాల్లో జక్కన్నకు డ్రైవర్ అవసరం లేదా?
Prabhas Fauji Actress: మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
మాది పాకిస్తాన్ కాదు, ఆ ఆర్మీతో సంబంధం లేదు... క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి
Abir Gulaal Movie: పహల్గాం ఉగ్ర దాడి - బాలీవుడ్ మూవీ 'అబీర్ గులాల్' బ్యాన్
పహల్గాం ఉగ్ర దాడి - బాలీవుడ్ మూవీ 'అబీర్ గులాల్' బ్యాన్
Embed widget