AP RGUKT: ఏపీ ట్రిపుల్‌ఐటీలో 194 టీచింగ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో టీచింగ్ పోస్టుల (Teaching Faculties) భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
AP RGUKT Teaching Faculties Recruitment 2024: ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో టీచింగ్ పోస్టుల (Teaching Faculties) భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా నూజివీడు (ఏలూరు జిల్లా), ఆర్కే వ్యాలీ (కడప జిల్లా), ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా), ఒంగోలు (ప్రకాశం జిల్లా) క్యాంపస్‌లలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 194 లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: recruitments@rgukt.in ద్వారా సంప్రదింవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీయూకేటీ క్యాంపస్‌లలో ప్రతి సంవత్సరం ఒక్కో క్యాంపస్‌లో 1100 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాలు పొందినవారికి 2 సంవత్సరాల ప్రీ యూనివర్సిటీ కోర్సు (PUC), 4 సంవత్సరాల B.Tech కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు..
* టీచింగ్ ఫ్యాకల్టీలు ..
ఖాళీల సంఖ్య: 194 పోస్టులు
➥ లెక్చరర్: 61 పోస్టులు
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్: 133 పోస్టులు
➥ లెక్చరర్: 61 పోస్టులు
క్యాంపస్‌లవారీగా పోస్టుల కేటాయింపు ..
➜ నూజివీడు (ఏలూరు జిల్లా) క్యాంపస్: 02 పోస్టులు
➜ ఆర్కే వ్యాలీ (కడప జిల్లా) క్యాంపస్: 18 పోస్టులు
➜ ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా) క్యాంపస్: 14 పోస్టులు
➜ ఒంగోలు (ప్రకాశం జిల్లా) క్యాంపస్: 27 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు ...
⫸ బయాలజీ: 05 పోస్టులు
⫸ కెమిస్ట్రీ: 17 పోస్టులు
⫸ ఇంగ్లిష్: 04 పోస్టులు
⫸ మ్యాథమెటిక్స్: 06 పోస్టులు
⫸ ఫిజిక్స్: 25 పోస్టులు
⫸ తెలుగు: 04 పోస్టులు
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (ఎంఏ/ఎంఎస్సీ/ఎంకామ్) ఉత్తీర్ణులై ఉండాలి. విద్యాసంస్థలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
జీతం: రూ.33,000.
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్: 133 పోస్టులు
క్యాంపస్‌లవారీగా పోస్టుల కేటాయింపు..
➜ నూజివీడు (ఏలూరు జిల్లా) క్యాంపస్: 31 పోస్టులు
➜ ఆర్కే వ్యాలీ (కడప జిల్లా) క్యాంపస్: 45 పోస్టులు
➜ ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా) క్యాంపస్: 28 పోస్టులు
➜ ఒంగోలు (ప్రకాశం జిల్లా) క్యాంపస్: 29 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు..
⫸ బయాలజీ: 02 పోస్టులు
⫸ సివిల్ ఇంజినీరింగ్: 11 పోస్టులు
⫸ సీఎస్‌ఈ: 34 పోస్టులు
⫸ ఈఈఈ: 23 పోస్టులు
⫸ ఈసీఈ: 38 పోస్టులు
⫸ ఇంగ్లిష్: 06 పోస్టులు
⫸ మేనేజ్‌మెంట్: 08 పోస్టులు
⫸ మ్యాథమెటిక్స్: 05 పోస్టులు
⫸ మెకానికల్: 05 పోస్టులు
⫸ ఎంఎంఈ: 01 పోస్టు
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌లోపాటు 55 శాతం మార్కులతో పీజీ ఉండాలి. నెట్/సెట్ లేదా పీహెచ్‌డీ అర్హత ఉండాలి.
జీతం: రూ.35,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.01.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.01.2024 (05:00 PM).