By: ABP Desam | Updated at : 14 Jan 2023 02:42 PM (IST)
Edited By: omeprakash
ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాలు
ఏపీలోని నిరుద్యోగులకు సంక్రాంతి శుభవార్త ఇది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఫిబ్రవరిలో విడుదల చేసి, ఏప్రిల్‌లోపే ఖాళీల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలు పూర్తిచేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఈసారి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే భర్తీ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఈ మేరకు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ గత తాజాగా పంచాయతీరాజ్ శాఖకు లేఖ కూడా రాసింది. పోస్టులవారీగా ఖాళీల వివరాలను ఆ లేఖలో పేర్కొంది.
ప్రస్తుతం ఎనర్జీ అసిస్టెంట్ సహా మొత్తం 20 కేటగిరీల ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్, వ్యవసాయ, పశు సంవర్ధక, సాంఘిక సంక్షేమ, ఉద్యానవన, సెరికల్చర్, ఫిషరీస్, వైద్య, ఆరోగ్య, హోం శాఖల పర్యవేక్షణలో ఆయా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ కూడా కేటగిరీల వారీగా ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలను మరోసారి పరిశీలించుకునేందుకు ఆయా శాఖల విభాగాధిపతుల నుంచి సమాచారం వేరుగా తెప్పించుకుంటోంది. మొత్తం మూడు నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు మిగిలిన ఉద్యోగాల నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా విడిగా మరో నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉంది.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా కేవలం నాలుగు నెలల్లోనే ప్రభుత్వం ముగించింది. అప్పట్లో మిగిలిన ఖాళీలకు 2020లో రెండో విడత నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి ఇప్పుడు మూడో విడత నోటిఫికేషన్ జారీ ప్రక్రియను మొదలు పెట్టింది.
ఖాళీల వివరాలు ఇలా..
మొత్తం ఖాళీలు: 14,523
1. గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి: 182
2. డిజిటల్ అసిస్టెంట్: 736
3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్: 578
4. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్: 467
5. హార్టికల్చర్ అసిస్టెంట్: 1,005
6. సెరికల్చర్ అసిస్టెంట్: 23
7. పశుసంవర్థకశాఖ అసిస్టెంట్: 4,765
8. ఫిషరీస్ అసిస్టెంట్: 60
9. ఇంజినీరింగ్ అసిస్టెంట్: 982
10. వీఆర్వో గ్రేడ్-2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ: 112
11. విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్: 990
12. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ: 170
13. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ: 197
14. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ: 153
15. వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ: 371
16. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ: 436
17. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ: 459
18. ఏఎన్‌ఎం/ వార్డు హెల్త్ సెక్రటరీ: 618
19. ఉమెన్ పోలీస్/ వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ: 1092
20. ఎనర్టీ అసిస్టెంట్: 1127
Also Read:
కానిస్టేబుల్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను రాష్ట్ర పోలీసు నియామక మండలి జనవరి 12న విడుదల చేసింది. అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఫోన్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 22న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. హాల్‌టికెట‌్‌లో అభ్యర్థి వివరాలతోపాటు పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.
ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ!
ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు జనవరి 7తో ముగిసింది. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు తీవ్రంగా పోటీ నెలకొంది. అంటే ఒక్కో పోస్టుకు 83 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జనవరి 12 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కానిస్టేబుల్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!
APPSC Mains Exam Schedule: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్