అన్వేషించండి

Postal GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ రెండో జాబితా విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

POSTAL RESULTS: పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను ఇండియా పోస్ట్ 'సెప్టెంబరు 17వ తేదీన విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచింది.

India Post GDS Results: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్టాఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను అధికారులు విడుదల చేశారు. రెండో జాబితాలో మొత్తం 22,416 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫలితాలకు సంబంధించి రెండో జాబితాలో ఏపీ నుంచి 664 మంది అభ్యర్థులు, తెలంగాణ నుంచి 468 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. 

గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణ పరిధిలో 981 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఆగస్టు 20న మొదటి జాబితా విడుదల చేయగా..తాజాగా రెండో జాబితాలను పోస్టల్ శాఖ విడుదల చేసింది. రెండో జాబితాలో ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీ లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. 

ఏపీ నుంచి ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితా కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ నుంచి ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితా కోసం క్లిక్ చేయండి..

Website

ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇవే..

➥ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ కాపీ 

➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో 

➥ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు

➥ అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు 

➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC) 

➥ కుల ధ్రువీకరణ పత్రం (కమ్యూనిటీ సర్టిఫికేట్) 

➥ఆధార్ కార్డు 

➥ ఆదాయ ధ్రువీకరణపత్రం (ఇన్‌కమ్ సర్టిఫికేట్)

➥ దివ్యాంగ ధ్రువీకరణ పత్రం (దివ్యాంగులైతే) 

➥ మెడికల్ సర్టిఫికెట్.

➥ ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లు, రెండు జతల జిరాక్స్ కాపీలు

ALSO READ: సింగరేణిలో మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు, ఎంపికైతే నెలకు 1.25 లక్షల జీతం

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget