APPSC Assistant Conservator Exam: అసిస్టెంట్ కన్జర్వేటర్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్ష షెడ్యూలు ఇదీ!
అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు 9 నుండి 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ నవంబరు 3న వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్ ఐడీ (OTPR ID), పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు 9 నుండి 11 వరకు ఆన్‌లైన్ విధానంలో (సీబీటీ) పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ కోసం క్లిక్ చేయండి..
పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా..
➤ నవంబరు 9న (ఉదయం): క్వాలిఫైయింగ్ పేపర్ (ఇంగ్లిష్, తెలుగు)
➤ నవంబరు 9న (మధ్యాహ్నం): పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ)
➤ నవంబరు 10న (ఉదయం): పేపర్-2 (మ్యాథమెటిక్స్- పదోతరగతి స్థాయిలో)
➤ నవంబరు 10న (మధ్యాహ్నం): పేపర్-3 (జనరల్ ఫారెస్ట్రీ-1)
➤ నవంబరు 11న (ఉదయం): పేపర్-4 (జనరల్ ఫారెస్ట్రీ-2)
ఏపీలో ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 20 నుండి మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఈ పోస్టులకు సంబంధించి రాతపరీక్ష ఖరారు తేదీలను ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఈ రాతపరీక్ష పూర్తిగా అబ్జెక్టీవ్ విధానంలో ఉంటుంది. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షలో మొత్తం 6 పేపర్లు ఉంటాయి. ఇందులో ఒకటి క్వాలిఫయింగ్ పేపర్ ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లిష్‌కు 50 మార్కులు, జనరల్ తెలుగుకు 50 మార్కులు ఉంటాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 40,270 నుండి రూ. 93,780 జీతభత్యాలుగా చెల్లిస్తారు.
పరీక్ష విధానం..
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు తొలుత ఇంగ్లిష్, తెలుగు యాబై మార్కుల చొప్పున నిర్వహించే పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, మాథ్స్ -150, జనరల్ ఫారెస్ట్రీ-1లో 150 మార్కులు, జనరల్ ఫారెస్ట్రీ-2కు సంబంధించి 150 మార్కులు.. మొత్తం 600 మార్కులకు నిర్వహించే ఈ ఎగ్జామ్ లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ దరఖాస్తు ప్రారంభం - అర్హత, ఎంపిక వివరాలివే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు 2న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 21లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, నవంబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'గ్రూప్-1' దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 92 పోస్టులకు అక్టోబరు 1న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే నవంబరు 2 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అనుమతి ఇచ్చింది. అయితే ఈ గడువును పొడగిస్తూ తాజాగా కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. నవంబరు 5 వరకు దరఖాస్తు గడువును పొడగించింది. అభ్యర్థులు నవంబరు 4న రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..