Andhra Pradesh Police Constable Exam Result 2025: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల; మీ ఫలితం తెలుసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే
Andhra Pradesh Police Constable Exam Result 2025: జూన్ 1న నిర్వహించిన ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్స్ విడుదలైంది.

Andhra Pradesh Police Constable Exam Result 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 ఫైనల్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ http://slprb.ap.gov.in/ లో ఫలితాలను ఉంచింది. రాత్రి పది గంటల తర్వాత ఈ రిజల్ట్స్ విడుదల చేసింది.
వివిధ దశల్లో నిర్వహించిన వడపోత తర్వాత ఫైనల్ రాత పరీక్షను జూన్ 1న నిర్వహించారు. ఈ తుది పరీక్షకు దాదాపు 37వేల 600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో వివిధ సామాజిక వర్గాలు, ఇతర రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకొని ఫైనల్‌గా సలెక్ట్ అయిన వారి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లోఉంచారు.
ఈ పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షను రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించింది. ఫలితాలు చూడటానికి అభ్యర్థులు హాల్ టికెట్ / రిజిస్ట్రేషన్ నంబర్ అవసరం అవుతుంది. హాల్ టికెట్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్తోపాటు పుట్టిన తేదీ కూడా ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత సబ్‌మిట్ బటన్‌పై ప్రెస్ చేస్తే మీరు ఏ స్థానంలో ఉన్నారో చూపిస్తోంది.
PMT/PET దశ నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు AP పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష నిర్వహించారు. ఇందులో టాప్‌లో ఉన్న వారిని కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఫైనల్ ఎగ్జామ్ జూన్ 1 ఒకే షిఫ్ట్‌లో ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరిగింది.
ఇదే AP పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాల లింక్
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితం 2025ను అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ లో ఉంచారు. మీరు కావాలనుకుంటే డైరెక్టుగా ఫలితాలు చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి ఫలితాల్లో పేర్లు కనిపించే అభ్యర్థులు పరీక్షల్లో అర్హత సాధించినట్టు లెక్క. కానిస్టేబుల్ పదవికి ఎంపిక అయినట్టు అర్థం.
ఈ ఫలితాలన్ని చెక్ చేయడానికి అభ్యర్థులు ముందుగా AP పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితం 2025 ఇక్కడ ఇచ్ిచన లింక్‌ను క్లిక్ చేయాలి.
లేటెస్ట్ న్యూస్ మెనులో, “Final Written Test Results for the post of SCT PC (Civil) and SCT PC (APSP) New” అనే నోటిఫికేషన్ చూస్తారు.
దానిపై క్లిక్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో లాగిన్ అడుగుతుంది. లాగిన్ అవ్వడానికి మీ రిజిస్ట్రేష్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
తర్వాత రిజల్ట్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అభ్యర్థులు తమ రోల్ నంబర్/పేరు ఉపయోగించి ఫలితం చూసుకోవచ్చు.
జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు తర్వాత దశకు అర్హత సాధించినట్టు లెక్క. అయితే, జాబితాలో పేర్లు లేని వాళ్లు అర్హత సాధించలేదని అర్థం.
భవిష్యత్ అవసరాల కోసం ఈలిస్ట్‌ను మీరు డౌన్ లోడ్ చేసుకోవడం ఉత్తమం.
ఈ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 6100 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పుడు ఈ జాబితాలో పేర్లు ఉన్న వాళ్లు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని క్రాక్ చేసినట్టు లెక్క.





















