News
News
X

AFCAT Result: ఏఎఫ్‌క్యాట్- 2023 పరీక్ష ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ఏఎఫ్‌క్యాట్-1 పరీక్ష నిర్వహించారు. మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహించారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్, మెడికల్ టెస్టులుంటాయి..

FOLLOW US: 
Share:

భార‌త వైమానిక ద‌ళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్-1)-2023 ఫలితాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సోమవారం (మార్చి 13) విడుదల చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ఈ కామన్ అడ్మిషన్ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు తమ ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను సమర్పించి ఫలితాలను చూసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ఏఎఫ్‌క్యాట్-1 ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తర్వాత దశలోని ఫిజికల్, మెడికల్ టెస్టులకు అర్హత సాధిస్తారు. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు. వీటిలోనూ అర్హత పొందిన అభ్యర్థులకు ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో గ్రూప్-ఎ గెజిటెడ్ హోదా ఉద్యోగాల్లో నియమిస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ తర్వాత ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంకుతో రూ.1,77,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు ఉంటాయి. మిలిటరీ సర్వీస్ పేలో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. 

ఫలితాలు ఇలా చూసుకోండి..

✪ మొదట ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.in లోకి లాగిన్ కావాలి.

✪ అక్కడ ‘candidate login’ సెక్షన్‌పై క్లిక్ చేసి ‘AFCAT 01/2023’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

✪ తర్వాత ఓపెన్ అయ్యే వెబ్‌పేజీలో అవసరమైన వివరాలను సమర్పించి.. లాగిన్ అవ్వాలి.

✪ వెంటనే అభ్యర్థికి సంబంధించిన ఫలితాలు కనిపిస్తాయి.

✪ ఫలితాలను డౌన్‌లోడ్ చేసి.. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

పోస్టుల వివరాలు..

* ఖాళీల సంఖ్య: 258

1) ఫ్లయింగ్ బ్రాంచ్: 10 (మెన్-05, ఉమెన్-05)

2)  గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 130 (మెన్-117, ఉమెన్-13)

బ్రాంచ్: ఏరోనాటికల్ ఇంజినీరింగ్.

3) గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 118 (మెన్-103, ఉమెన్-15)

బ్రాంచ్: వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, ఎల్‌జీఎస్‌, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ. 

AFCAT 01/2023 నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 400 ఉద్యోగాలు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. మార్చి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియాలో 73 ఉద్యోగాలు - వివరాలు ఇలా!
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్) గువాహటిలోని ఎయిమ్స్‌లో పనిచేయడానికి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73  పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి/ 10+2/ ఇంటర్మీడియట్/ బీఈ/ బీటెక్/బీఎస్సీ/ గ్రాడ్యుయేషన్/ డిప్లొమా/ డీఎంఎల్‌టీ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 21 వరకుఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. ‌స్కిల్‌టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో నాన్-టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌ డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తును నోటిఫికేషన్‌ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తుచేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 13 Mar 2023 08:54 PM (IST) Tags: IAF AFCAT 1 Result 2023 AFCAT Result 2023 AFCAT Result AFCAT 2023 AFCAT 1 Result 2023 AFCAT 1 result AFCAT

సంబంధిత కథనాలు

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

AP High Court Results: జిల్లా కోర్టు రాతపరీక్షల ఫలితాలు విడుదల, మెరిట్ జాబితా & కటాఫ్ మార్కులను చెక్‌చేసుకోండి!

AP High Court Results: జిల్లా కోర్టు రాతపరీక్షల ఫలితాలు విడుదల, మెరిట్ జాబితా & కటాఫ్ మార్కులను చెక్‌చేసుకోండి!

Job Mela: 31న విజయవాడలో మెగా 'జాబ్ మేళా' - ఏయే కంపెనీలు పాల్గొంటున్నాయంటే?

Job Mela:  31న విజయవాడలో మెగా 'జాబ్ మేళా' - ఏయే కంపెనీలు పాల్గొంటున్నాయంటే?

UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - 69 పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - 69 పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

PGCIL Recruitment: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్‌ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!

PGCIL Recruitment: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 138 ఇంజినీర్‌ ట్రెయినీ ఖాళీలు- అర్హతలివే!

టాప్ స్టోరీస్

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి