AAI Recruitment: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 400 ఉద్యోగాలు, అర్హతలివే!
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు చేసుకోవాలి. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. మార్చి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
➥ సెక్యూరిటీ స్క్రీనర్(ఫ్రెషర్): 400 పోస్టులు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 19.03.2023 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటరాక్షన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.
వేతనం: నెలకు రూ.30,000-రూ.34,000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 19.03.2023.
Also Read:
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియాలో 73 ఉద్యోగాలు - వివరాలు ఇలా!
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) గువాహటిలోని ఎయిమ్స్‌లో పనిచేయడానికి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి/ 10+2/ ఇంటర్మీడియట్/ బీఈ/ బీటెక్/బీఎస్సీ/ గ్రాడ్యుయేషన్/ డిప్లొమా/ డీఎంఎల్‌టీ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 21 వరకుఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. స్కిల్‌టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ముంబయి పోర్ట్ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌బీఐలో 868 ఉద్యోగాలు, వీరు మాత్రమే అర్హులు! ఎంపికైతే నెలకు రూ.40 వేల జీతం!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ (RBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అమరావతి పరిధిలో 39 పోస్టులు, హైదరాబాద్ పరిధిలో 48 పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ పోస్టుల్లో నియమించనుంది. బ్యాంకింగ్‌లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 31తో గడువు ముగియనుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..