Assistant Professor Posts: వైద్య శాఖలో 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల- తేదీలు, పూర్తి వివరాలు
Director of Medical Education in Telangana | డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద వివిధ అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జులై 10న దరఖాస్తులు ప్రారంభమవుతాయి.

హైదరాబాద్: మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కింద వివిధ స్పెషాలిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల కోసం వెబ్‌సైట్ (https://mhsrb.telangana.gov.in)లో అర్హత ఉన్న వ్యక్తుల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు.
ఆన్‌లైన్ దరఖాస్తు 10.07.2025న ప్రారంభం అవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 17.07.2025న సాయంత్రం 5.00 గంటలు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను జులై 18 నుండి 19.న సాయంత్రం 5.00 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే అంగీకరిస్తారు. దరఖాస్తుదారులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, వారు ప్రతి పోస్టుకు విడిగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
పోస్ట్ కోడ్, పోస్ట్ పేరు - పోస్టుల సంఖ్య
01 అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనాటమీ) - 22
02 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజియాలజీ) - 29
03 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పాథాలజీ) - 15
04 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కమ్యూనిటీ మెడిసిన్ (SPM) - 25
05 అసిస్టెంట్ ప్రొఫెసర్ (మైక్రోబయాలజీ) - 15
06 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫార్మకాలజీ) - 28
07 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫోరెన్సిక్ మెడిసిన్ మరియు టాక్సికాలజీ) - 21
08 అసిస్టెంట్ ప్రొఫెసర్ (బయో-కెమిస్ట్రీ) - 18
09 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్) - 9
10 అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ మెడిసిన్) - 47
11 అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జరీ) - 43
12 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్స్) - 28
13 అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీషియా) - 44
14 అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియో-డయాగ్నోసిస్) - 21
15 అసిస్టెంట్ ప్రొఫెసర్ (సైకియాట్రీ) - 8
16 అసిస్టెంట్ ప్రొఫెసర్ (రెస్పిరేటరీ మెడిసిన్ T.B.&.C.D (పల్మనరీ మెడిసిన్)) - 5
17 అసిస్టెంట్ ప్రొఫెసర్ (డెర్మటాలజీ, వెనిరియాలజీ మరియు లెప్రసీ (DVL) డెర్మటాలజీ STD) - 5
18 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ మెడిసిన్ మరియు రిహాబిలిటేషన్) - 3
19 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్రసూతి & గైనకాలజీ) - 90
20 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆప్తాల్మాలజీ) - 4
21 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆర్థోపెడిక్స్) - 12
22 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఓటో-రైనో) లారింగాలజీ హెడ్ - 5
23 అసిస్టెంట్ ప్రొఫెసర్ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) - 21
24 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎమర్జెన్సీ మెడిసిన్) - 15
25 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియాలజీ) - 9
26 అసిస్టెంట్ ప్రొఫెసర్ (థొరాసిక్ సర్జరీ / కార్డియాక్ సర్జరీ (C.T. సర్జరీ)) - 14
27 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎండోక్రినాలజీ) - 7
28 అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) - 9
29 అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరాలజీ) - 3
30 అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరో-సర్జరీ) - 7
31 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్లాస్టిక్ & పునర్నిర్మాణ శస్త్రచికిత్స) - 10
32 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్ సర్జరీ) - 5
33 అసిస్టెంట్ ప్రొఫెసర్ (యూరాలజీ) - 6
34 అసిస్టెంట్ ప్రొఫెసర్ (నెఫ్రాలజీ) - 4
మల్టీ జోన్ 1లో 379 పోస్టులు, మల్టీ జోన్ 2లో 228 పోస్టులు మొత్తం 607 పోస్టులు భర్తీ చేయనున్నారు.
దరఖాస్తుదారులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు కేటాయిస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు/సంస్థలు /కార్యక్రమాలలో కాంట్రాక్ట్/ అవుట్‌సోర్స్ ప్రాతిపదికన చేసిన సేవలకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు కేటాయిస్తారు.
- అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్టంగా 80 పాయింట్లు ఇస్తారు. అంటే సంబంధిత పిజి డిగ్రీ/సూపర్ స్పెషాలిటీలో పొందిన మార్కులను 80 శాతం బేస్‌గా మార్చారు. మార్కులు ఇవ్వని విశ్వవిద్యాలయాలలో చదివిన అభ్యర్థులకు, గ్రేడ్‌లను మార్కులుగా మార్చడం ద్వారా 80 శాతం బేస్‌గా పరిగణించనున్నారు.






















