Telangana Health Department Jobs: తెలంగాణ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర- 7వేల కొలువులకు నోటిఫికేషన్‌లు విడుదల!
Telangana Health Department Jobs: తెలంగాణ ఆరోగ్యశాఖలో కొలువుల జాతర మొదలైంది. ఏకంగా 7వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.

Telangana Health Department Jobs: తెలంగాణ ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఓకే రోజు మూడు వేరు వేరు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్దమైయ్యింది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు. అసిస్టెంట్ ఫ్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేన్లు విడుదలకానున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్‌లో గడచిన 17 నెలల్లో 7వేలకుపైగా పోస్టులను భర్తీ చేసింది ప్రభుత్వం. తాజాగా వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కాసేపట్లో బంపర్ ఆఫర్ ఇవ్వనుంది.
శుక్రవారం నాటికి వైద్యశాఖలో కొత్త పోస్టుల భర్తీకి నోటిపికేషన్లు విడుదలకానున్నాయి. దీనికి మార్గం సుగమమైంది. తాజాగా విడుదల కాబోతున్న నోటిఫికెేషన్ల ద్వారా 3212 మంది నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్టసిస్ట్, 1284 ల్యాబ్ టెన్నీషియన్స్, 1950 మల్టీ ఫర్పస్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్స్ పోస్టులకు భర్తీ పక్రియ ప్రారంభం కాబోతోంది.
ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి ఫలితాలు విడుదల చేయడంతోపాటు మెరిట్ జాబితా సిద్దమైంది. అందులోనూ విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా నోటిఫికేషన్ల విడుదల తరువాత, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగాల భర్తీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈరోజు లేదా రేపు ఉదయం లోపు ఉద్యోగాల భర్తీకి మూడు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. 





















