News
News
వీడియోలు ఆటలు
X

ఏపీలో 45 వేల టీచర్ పోస్టులు ఖాళీ అంటున్న కేంద్రం, కేవలం 717 అంటున్న రాష్ట్రం!

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, వీటికి ప్రాధాన్యమిచ్చి భర్తీ చేయాలని కేంద్ర ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ-ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్) వెల్లడించింది.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, వీటికి ప్రాధాన్యమిచ్చి భర్తీ చేయాలని కేంద్ర ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ-ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్) వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖకు రాష్ట్రం నుంచి అందిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాల ప్రకారం 45,355 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. గత పీఏబీలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీన్ని కొట్టిపారేశారు. అవి కరోనా సమయంలో ఖాళీలని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఇప్పుడు కేంద్రం మళ్లీ అదే సంఖ్యను వెల్లడించింది. 

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకపక్క డీఎస్సీ నిర్వహిస్తామంటూ ప్రకటనలు చేస్తుండగా.. విద్యాశాఖ మాత్రం 717 ఎస్జీటీ ఖాళీలే ఉన్నాయంటూ కేంద్రానికి వెల్లడించడం గమనార్హం. సమగ్ర శిక్ష అభియాన్ వార్షిక ప్రణాళిక, బడ్జెట్ 2023-24కు కేంద్రం ఆమోదం తెలిపింది. మార్చి 22న జరిగిన రాష్ట్ర పీఏబీ సమావేశంలో చేసిన తీర్మానాలను శనివారం విడుదల చేసింది. రాష్ట్రంలో 85.5% సెకండరీ పాఠశాలల్లోనే ప్రధాన సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నారని, 57 మంది విద్యార్థులకు ఒక గణిత ఉపాధ్యాయుడు, 67 మందికి ఒక సామాన్యశాస్త్రం, 72 మందికి ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చొప్పున ఉన్నారని పేర్కొంది. సెకండరీ స్థాయిలో అన్ని పాఠశాలల్లో అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. 2023-24కు మొత్తం రూ.3,843 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఇందులో గతేడాది ఇచ్చిన రూ.992 కోట్లను కలిపి చూపింది.

ఏకోపాధ్యాయ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సంఖ్యపెరిగిందని పీఏబీ పేర్కొంది. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిలో వ్యత్యాసం ఎక్కువగా ఉందని, దీన్ని పరిష్కరించేందుకు హేతుబద్ధీకరణ చేయాలని సూచించింది. పాఠ్యాంశాల రూపకల్పన, అకడమిక్ కార్యక్రమాలను పర్యవేక్షించే రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ)లోనూ ఖాళీలు ఉన్నాయి. 45 అకడమిక్ పోస్టులు మంజూరైతే ప్రస్తుతం 25 మందే ఉన్నారు. జిల్లా విద్య, శిక్షణ సంస్థ (డైట్)ల్లో 325 మంది పని చేయాల్సి ఉండగా.. 262మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఉమ్మడిసర్వీసు నిబంధనల కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నందున భర్తీ చేయలేకపోతున్నట్లు పేర్కొంది.

ఒక్క విద్యార్థీ చేరని ప్రాథమిక పాఠశాలల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా పెరిగింది. 2020-21లో 35 పాఠశాలల్లో సున్నా ప్రవేశాలు ఉండగా.. 2022-23కు వచ్చేసరికి ఇది 40 పాఠశాలలకు పెరిగింది. 2021-22లో 3,670 బడుల్లో 15 మంది లోపు, 12,851 బడుల్లో 30 కంటే తక్కువ మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఆరో తరగతిలో బడి మానేసే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2020-21 నుంచి 2021-22 వరకు చూస్తే 9, 10, 11 తరగతుల్లో ఆ సంఖ్య భారీగా పెరిగింది. దీన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పీఏబీ సూచించింది. 

యూడైస్ ప్లస్ ప్రకారం ప్రాథమిక నుంచి మాధ్యమిక విద్యకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో తక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో ప్రాథమిక నుంచి మాధ్యమిక విద్యకు వెళ్లకుండా మానేస్తున్నవారు 2లక్షల మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం పదో తరగతి తర్వాత విద్యార్థులు పాలిటెక్నిక్, సర్టిఫికెట్ కోర్సులకు వెళ్తున్నారని సమాధానమిచ్చింది.

Also Read:

టీచర్లకు వేసవి సెలవుల్లేవ్! పనులు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసిన విద్యాశాఖ!
ఏపీలో వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ టీచర్లకు పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్లు అందించడం, ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’, జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరా, పీఎం శ్రీ పాఠశాలల కాస్టింగ్‌ షీట్‌ రూపకల్పన, ‘నాడు-నేడు’ పనులు, పిల్లలు గ్రంథాలయాలకు వెళ్లేలా చూడడం, విద్యార్థుల ప్రవేశాల నిర్వహణలాంటి పనులను అప్పగించింది. సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ కొందరు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మే 1నుంచి పాఠశాలలకు ఇచ్చే సెలవుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులపై ఉన్నతాధికారులు ఆదేశాలనిచ్చారు.
మరింత చదవండి..

వేసవి సెలవుల్లో విద్యార్థులకు వినూత్న కార్యక్రమం, పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు!
వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెలవుల్లో ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలని  పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 19న ఆదేశాలు జారీచేసింది. ఈ కార్యక్రమాన్ని మే 1 నుంచి జూన్‌ 10 వరకు అమలు చేయాలని సూచించింది. ఉపాధ్యాయులు, అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆదేశించింది. పాఠశాలలోని విద్యార్థులను బృందాలుగా విభజించి ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలని, వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసి, రోజువారీగా కథలను పోస్ట్‌ చేయాలని ఆదేశించింది. ఆ కథలు చదివాక విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని పేర్కొంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 30 Apr 2023 04:42 PM (IST) Tags: AP Jobs Education News SGT Posts AP Teacher Vacancies Teacher Posts in AP Teacher Vacancies

సంబంధిత కథనాలు

PNB SO Application: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తుకు రేపటితో ఆఖరు!

PNB SO Application: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తుకు రేపటితో ఆఖరు!

Postal Jobs: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Postal Jobs: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

BDL Jobs: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 12 డిప్యూటీ మేనేజర్ & అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు!

BDL Jobs: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 12 డిప్యూటీ మేనేజర్ & అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు!

MANUU: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో 47 టీచింగ్ పోస్టులు!

MANUU: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో 47 టీచింగ్ పోస్టులు!

APSFC: ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో 20 అసిస్టెంట్‌ మేనేజర్ ఉద్యోగాలు, అర్హతలివే!

APSFC: ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో 20 అసిస్టెంట్‌ మేనేజర్ ఉద్యోగాలు, అర్హతలివే!

టాప్ స్టోరీస్

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

Tirupati News :  శ్రీవారి  సేవలో బీజేపీ అగ్రనేతలు -  కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!

Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!