By: ABP Desam | Updated at : 20 Apr 2023 01:28 PM (IST)
Edited By: omeprakash
వేసవి సెలవుల్లో వినూత్న కార్యక్రమం
వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెలవుల్లో ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 19న ఆదేశాలు జారీచేసింది. ఈ కార్యక్రమాన్ని మే 1 నుంచి జూన్ 10 వరకు అమలు చేయాలని సూచించింది.
ఉపాధ్యాయులు, అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆదేశించింది. పాఠశాలలోని విద్యార్థులను బృందాలుగా విభజించి ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలని, వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి, రోజువారీగా కథలను పోస్ట్ చేయాలని ఆదేశించింది. ఆ కథలు చదివాక విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని పేర్కొంది.
తరగతుల వారీగా గ్రంథాలయ పుస్తకాలను విభజించి, ప్రదర్శించాలని వెల్లడించింది. విద్యార్థులు చదివే సామర్థ్యం ఆధారంగా 5-10 పుస్తకాలను ఇవ్వాలని తెలిపింది. పుస్తకాలు చదవడం, కథలు రాయడంపై పోటీలను నిర్వహించనుంది. 1-5 తరగతుల విద్యార్థులు కథ చదువుతూ రికార్డు చేసి, పంపించాలి. 6-8 తరగతుల వారు స్వయంగా కథలు రాసి, పంపించాలి.
9-12 తరగతులు, డైట్ విద్యార్థులు రెండు కథలు రాసి, ఈ-మెయిల్ చేయాలి. ఇంట్లో సొంతంగా గ్రంథాలయం నిర్వహణ, డ్రాయింగ్ పోటీలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ఉపాధ్యాయులకూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. కాగా, సమ్మెటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి..
నవోదయ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
2023-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 29న జరిగే ఈ పరీక్షకు జనవరి 31వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు గడువు సమీపిస్తున్న వేళ తాజాగా హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష ఏప్రిల్ 29న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫలితాలను జూన్‌లోపు విడుదల చేసే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డులు పొందాలంటే విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
హాల్‌టికెట్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
సిల్వర్ సెట్-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2023' పరీక్షకు ఏప్రిల్ 7న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు.ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ పరీక్ష పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్ షీట్స్ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?
CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!
APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా