అన్వేషించండి

Telangana News: కానిస్టేబుల్ శిక్షణకు 30 శాతం మంది గైర్హాజరు, పోలీసు ఉన్నతాధికారుల కీలక నిర్ణయం

Telangana News: తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 21న శిక్షణ ప్రారంభమైంది. అయితే శిక్షణకు భారీగా అభ్యర్థులు గైర్హాజరవడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది.

Constable Training: తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 21న శిక్షణ ప్రారంభమైంది. అయితే శిక్షణకు భారీగా అభ్యర్థులు గైర్హాజరవడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. కానిస్టేబుల్ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 13,953 మంది ఎంపికవగా.. తొలి దశలో 9,333 మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. వీరికి ఫిబ్రవరి 21న శిక్షణ ప్రారంభించారు. ఈ శిక్షణకు అన్ని కేంద్రాల్లో కలిపి దాదాపు 30 శాతం మంది అభ్యర్థులు హాజరుకాలేదు. దీంతో తొలిరోజే సుమారు 2833 మంది హాజరుకాకపోవడంతో కారణాల అన్వేషణలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. 

రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్లు, పీటీసీలు, సీటీసీలు..తదితర 28 కేంద్రాల్లో శిక్షణను ప్రారంభించారు. శిక్షణ తొలిరోజు దాదాపు 6,500 మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అంబర్‌పేట పోలీస్ శిక్షణ కళాశాల(పీటీసీ)లో 650 మందికిగానూ 482 మంది, మేడ్చల్ పీటీసీలో 509కి 422 మంది, కరీంనగర్ పీటీసీలో 1000కి 675 మంది, వరంగల్ నగర శిక్షణ కేంద్రం(సీటీసీ)లో 250కి 201 మంది హాజరయ్యారు. దాదాపు అన్ని కేంద్రాల్లో ఇదే పరిస్థితి. మొత్తంగా సుమారు 30 శాతం మంది హాజరుకాకపోవడంతో..కారణాలను అన్వేషించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

ఎంపికైన వారిలో పలువురు ఇతర ఉద్యోగాలు సాధించడం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇటీవల వెలువడిన గురుకుల ఉపాధ్యాయులు, స్టాఫ్‌నర్స్‌ల పోస్టులను దక్కించుకున్నందునే పలువురు శిక్షణకు గైర్హాజరైనట్లు అంచనా వేస్తున్నాం. హాజరుకాని వారిలో మహిళా కానిస్టేబుల్ శిక్షణార్థులే ఎక్కువగా ఉండటం ఆ వాదనకు బలాన్నిస్తోంది. మరోవైపు కేసులు ఉన్న కారణంగా కొందరు శిక్షణకు రాలేదని సమాచారం. దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నారని పోలీస్ నియామక మండలి వర్గాల సమాచారం.

భారీగా పెరగనున్న బ్యాక్‌లాగ్‌ పోస్టులు..
పోలీస్ నియామక మండలి(TSLPRB) 2022లో విడుదల చేసిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రకారం.. సివిల్-4,965; ఏఆర్-4,423, ఎస్‌ఏఆర్ సీపీఎల్-100, టీఎస్‌ఎస్‌పీ-5,010, ఐటీ అండ్ కమ్యూనికేషన్-262, పీటీవో-121 ఉండగా.. ఈ లెక్కన అన్ని విభాగాల్లో కలిపి 14,881 మందిని ఎంపిక చేయాలి. అయితే ఎంపిక ప్రక్రియ పూర్తయిన సమయంలో తగినంత మంది అర్హులు లేకపోవడంతో 13,953 మందినే శిక్షణకు ఎంపిక చేశారు. ఈ క్రమంలో శిక్షణ ప్రారంభానికి ముందే 928 పోస్టులు బ్యాక్‌లాగ్ కింద మిగిలిపోయాయి. ఇప్పుడు శిక్షణకూ భారీ సంఖ్యలో గైర్హాజరవడంతో బ్యాక్‌లాగ్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. శిక్షణలో చేరేందుకు అభ్యర్థులకు ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని శిక్షణ విభాగం నిర్ణయించింది. ఆ లోపు ఎంతమంది శిక్షణకు హాజరవుతారనేది తేలితేనే బ్యాక్‌లాగ్‌లపై స్పష్టత రానుంది.

28 కేంద్రాల్లో ఏర్పాట్లు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 కేంద్రాల్లో ఫిబ్రవరి 21 నుంచి శిక్షణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతోపాటు టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ కళాశాలలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, నగర శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వాస్తవానికి సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్, టీఎస్‌ఎస్‌పీ విభాగాలకు సంబంధించి మొత్తం 13,444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. అయితే రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాల్లో 11 వేల మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. దీంతో టీఎస్‌ఎస్‌పీ విభాగానికి చెందిన 4,725 మందికి కానిస్టేబుళ్లకు తాత్కాలికంగా వాయిదా వేసి, మిగిలిన వారికి శిక్షణ ప్రారంభించారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget