ఆవలించినప్పుడు కళ్లల్లో నీళ్లెందుకు వస్తాయి?
చాలా మంది ఈ విషయాన్ని గమనించి ఉంటారు. కానీ ఎందుకు వస్తామో మాత్రం చాలా మందికి తెలియదు.
బాగా నిద్ర వస్తున్నప్పుడు లేదా, నిద్ర సరిపోక మధ్యలో మెలకువడం వచ్చేసినప్పుడు ఆవలింతలు ఎక్కువ వస్తాయి. అప్పుడు కళ్లల్లో నీళ్లు ఊరతాయి. అలా ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? మన శరీరంలో జరిగే ప్రతిచర్యకు ఒక కారణం ఉంటుంది.మన కనుబొమ్మల దిగువన లాక్రిమల్ గ్రంథులు ఉంటాయి. ఇవి మన కళ్లు ఉత్పత్తి చేసే కన్నీళ్లకు కారణమవుతాయి. ఈ గ్రంధులు రోజంతా నెమ్మదిగా నీటిని ఉత్పత్తి చేస్తుంటాయి. ఎందుకంటే కళ్లు పొడి బారకూడదు. ఎప్పుడు తేమవంతంగా ఉండాలి.
ఆవలించినప్పుడు...
అయితే ఆవలించినప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీరు గ్రంధుల నుంచి విడుదలై కళ్లల్లో చేరుతుంది.మీరు ఆవలించినప్పుడు మీ ముఖ కండరాలు సంకోచిస్తాయి. ఆ సమయంలో కన్నీటి గ్రంధులపై ఒత్తిడి పడుతుంది. ఒత్తిడి వల్ల గ్రంధులను పిండినట్టు అవుతుంది. అప్పుడు అందులోని ఎక్కువ నీరు కళ్లల్లోకి చేరుకుంటాయి. అందుకే సాధారణం ఎక్కువ నీరు ఆవలించినప్పుడు కళ్లలోకి వస్తుంది.
ఒక అంటువ్యాధి...
చాలా మంది వినే ఉంటారు... ఆవలింత ఒక అంటువ్యాధి అని. ఒకరు ఆవలిస్తే పక్కనున్న వారికి కూడా ఆవలింతలు వచ్చేస్తాయి. మన ఆవలించడం ఇప్పుడు కాదు తల్లి గర్భంలోనే మొదలుపెట్టేశాం. ఒక వ్యక్తి జీవితకాలంలో రెండు లక్షల 40 వేల సార్లు ఆవలిస్తాడని అంచనా.
ఎందుకు వస్తాయి?
మనం బాగా అలసిపోయినప్పుడు మెదుడలోని ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు మనం చల్లటి గాలిని కోరుకుంటాం. చల్లటి గాలిని పీల్చినప్పుడు మెదడు చల్లబడడం మొదలవుతుంది. ఉత్తేజాన్ని పొందేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో మెదడు అప్రమత్తంగా మారుతుంది. ఆవిలింతల ద్వారా తన ఉష్ణోగ్రతను, అలసటను బయటికి పంపిస్తుంది. ఆవలించేది కేవలం మనుషలే కాదు, జంతువులు కూడా.
Also read: ఫూల్ మఖానా రోజూ ఇలా తింటే కంటి నిండా నిద్రే నిద్ర
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.