అన్వేషించండి

Liver Health: కాలేయ పనితీరు సరిగా ఉండాలంటే ఈ ఆహారాలను దూరం పెట్టండి

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయ పనితీరు సక్రమంగా ఉండాలి. కానీ మనం తీసుకునే ఆహారాలు దాని పనితీరుని మందగించేలా చేసి అనారోగ్యాల పాలు చేస్తున్నాయి.

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాలేయానికి ఆరోగ్యకరమైన, హాని చేయని ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అది దెబ్బతిన్నప్పుడు ఆహారాన్ని సరిగా ప్రాసెస్ చేయదు. అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాలేయం దెబ్బతినడం అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. శరీరంలోని ఏ అవయవానికి లేని ప్రత్యేకమైన పని ఇది చేయగలదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే కాలేయం తనని తాను బాగు చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ఓట్స్, ఆకుపచ్చ ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు వంటి కొన్ని ఆహారాలు కాలేయానికి మంచివి. ఇక కాలేయాన్ని నాశనం చేసే కొన్ని ఆహారాల జాబితా ఇక్కడ ఇస్తున్నాం. వీటిని దూరంగా ఉంచితే మీ లివర్ కి ఎటువంటి ఢోకా ఉండదు.

చక్కెర

అధిక మొత్తంలో చక్కెర లేదా చక్కెర జోడించిన ఆహారాన్ని తీసుకోవడం నివారించాలి. ఎందుకంటే కాలేయం చక్కెరను కొవ్వుగా మారుస్తుంది. షుగర్ అతిగా తీసుకుంటే శరీరంలోను అధికంగా కొవ్వు పేరుకుపోతుంది. ఇది కాలేయంతో సహా ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుంది. చివరికి ఫ్యాటీ లివర్ వ్యాధికి దారి తీస్తుంది.

ఎరేటెడ్ డ్రింక్స్

సోడా, కోలా వంటి ఎరేటెడ్ డ్రింక్స్ అధిక వినియోగం మానుకోవాలి. వీటిని తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. వీటిలో చక్కెర అధికంగా ఉండటం వల్ల కొవ్వు పేరుకుపోయి ఊబకాయం పరిస్థితి రావచ్చు.

ఉప్పు

ఏ వంటకు అయినా రుచి ఇచ్చేది  ఉప్పు. అందుకే అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందట. ఎంత మితంగా తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఉప్పు ఎక్కువ అయితే కాలేయం దెబ్బతింటుంది. అధిక మొత్తంలో ఉప్పును తీసుకుంటే శరీరంలో నీరు చేరేలా చేస్తుంది. ఇది శరీరానికి హానికరం. సంతృప్త కొవ్వులు, సోడియం అధికంగా ఉన్నందున చిప్స్, ఉప్పు బిస్కెట్లు, స్నాక్స్ మొదలైన ప్యాక్ చేసిన ఆహారాన్ని నివారించాలి. ఇవి కొవ్వు కాలేయ వ్యాధి, ఊబకాయానికి కారణం కావచ్చు.

రెడ్ మీట్

రెడ్ మీట్ ని జీర్ణం చేసుకోవడం కాలేయానికి చాలా కష్టమైన పని. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉన్నప్పటికీ వాటిని విచ్చిన్నం చేయడం లివర్ కు కష్టం. కాలేయంలో ప్రోటీన్ ఏర్పడినప్పుడు అది నాన్ ఆల్కాహాలిక ఫ్యాటీ లివర్ డీసీజ్ కు దారి తీస్తుంది. ఈ అదనపు ప్రోటీన్ మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది.

మద్యం

కాలేయ వ్యాధులు, వైఫల్యానికి ప్రధాన కారణం మద్యం తీసుకోవడం. అధిక ఆల్కాహాల్ వినియోగం వల్ల ఆల్కహాలిక ఫ్యాటీ లివర్ డీసీజ్ దారి తీస్తుంది. చియారికి ఇది కాలేయ పనితీరును ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ సిర్రోసిస్ సిండ్రోమ్ కు దారి తీయవచ్చు. ఇందులో కాలేయ కణాలు పూర్తిగా దెబ్బతింటాయి. లివర్ సిర్రోసిస్ వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

ఫ్యాటీ ఫుడ్

పిజ్జా, పాస్తా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫాస్ట్ ఫుడ్ రుచిగా ఉంటాయి. కానీ ఈ ఆహారాలు అధిక సంతృప్త లేదా ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ కారణంగా కాలేయానికి హాని చేస్తాయి. సిర్రోసిస్ సమస్యను కలిగిస్తాయి. సంతృప్త కొవ్వులు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. గుండె జబ్బులకు కారణమవుతుంది.

తెల్లని పిండి

పాస్తా, పిజ్జా, బ్రెడ్ వంటి వాటిని తెల్లటి పిండితో చేస్తారు. వీటికి ఉపయోగించే మైదా కాలేయానికి హాని చేస్తుంది. ఇవి షుగర్ గా మారి శరీరంలో కొవ్వుగా చేరి చివరికి ఫ్యాటీ లివర్ వ్యాధికి దారి తీస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: సోంపు గింజలు తీసుకుంటే బరువు తగ్గుతారా? వాటిని ఏ రూపంలో తీసుకుంటే మంచిది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget