అన్వేషించండి

Health Tips : టీ, కాఫీల్లో చక్కెర కలిపి తాగుతున్నారా? నో ప్రాబ్లం - కానీ, దానికీ ఓ లెక్కుంది!

చక్కెరను పరిమితంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా. టీ లేదా కాఫీలో చక్కెరను 30 గ్రాములు మించకుండా తీసుకుంటే ఎలాంటి జబ్బులు రావని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

టీ లేదా కాఫీల్లో చక్కెర కలుపుకుని తాగుతున్నారా? నో.. ప్రాబ్లం. కానీ, ఎక్స్‌ట్రా చక్కెర మాత్రం కలపొద్దు. ఎందుకంటే దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. అది మించితే.. డయాబెటిస్‌తోపాటు అనేక రకాల వ్యాధులు వెంటపడతాయి. 2015లో బ్రిటన్ శాస్త్రవేత్తలు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. రోజులో ఒకటి లేదా రెండుసార్లు తాగే టీ, కాఫీల్లో రుచి కోసం కాసింత చక్కెర వేసుకుని తాగితే సమస్య ఏమీ ఉండదని చెప్పారు. అయితే, 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర కలిపితేనే సమస్య అని పేర్కొన్నారు.

దంతాల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు,  పెరుగుతున్న డయాబెటిస్, ఊబకాయం సంబంధిత వ్యాధులను అధిగమించేందుకు చక్కెరను రోజుకు 30 గ్రాములకు మాత్రమే పరిమితం చేయాలని సూచించారు. ముఖ్యంగా టీ లేదా కాఫీలో చక్కెరను 30 గ్రాములు మించకుండా తీసుకుంటే ఎలాంటి జబ్బులు రావని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే..

డచ్,  బ్రిటీష్ శాస్త్రవేత్తలు కోపెన్‌హాగన్ స్టడీ నుంచి డేటాను విశ్లేషించి కొన్ని కొత్త విషయాలను కనిపెట్టారు. ఇది 1970 నుంచి లక్షలాది మంది పురుషులను ట్రాక్ చేసి పరీక్షలను విశ్లేషించి కొత్త అధ్యయన నివేదికను రూపొందించారు. ఇందులో పురుషులు తమ హాట్ డ్రింక్స్‌లో ఎంత చక్కెరను జోడించాలి అనేదానిపై ఎలాంటి సూచన చేయలేకపోయినప్పటికీ, టీ లేదా కాఫీలో అదనంగా చక్కెరను జోడించవద్దని రోజుకు 30 గ్రాముల చక్కెర సరిపోతుందని నిపుణులు సూచించారు.

బ్రిటిష్ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం మన ఆహారంలో చక్కెర శాతం తక్కువగా ఉండటం వల్ల  ఎలాంటి ప్రమాదకరమైన జబ్బులు రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చట. అయితే చాలా కాలంగా టీ, కాఫీల్లో అధిక చక్కెర వాడకం వల్ల గుండెపోటు, క్యాన్సర్ మరణాలు అధికంగా సంభవించే అవకాశం ఉందనే వాదనలు వినిపించాయి. అధిక చక్కెర వినియోగం కార్డియోమెటబాలిక్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. గుండెపోటు, స్ట్రోక్,  డయాబెటిస్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణం అవుతుంది. 8,600 కంటే ఎక్కువ శాస్త్రీయ కథనాలు అధిక చక్కెర వినియోగం గుండె సమస్యలు ఇతర మెటబాలిక్ సమస్యలకు దారితీస్తుంది. 

టీ కాఫీతోపాటు కూల్ డ్రింక్ లో కూడా అధిక శాతం లో చక్కెర ఉంటుంది. అయితే వీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు అలాగే కేక్స్, పేస్త్రీలు, స్వీట్లు చాక్లెట్లు వంటి వాటిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది తద్వారా ఇది మీ శరీరంలో మెటబాలిజంను దెబ్బతీస్తుందని ఫలితంగా డయాబెటిస్ వంటి వ్యాధులకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో చక్కర శాతం పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుందని తద్వారా మీ హృదయ ఆరోగ్యం దెబ్బతింటుందని కూడా సూచిస్తున్నారు.  కాబట్టి.. ఇకపై మీరు తాగే టీ, కాఫీల్లో రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర కలవకుండా జాగ్రత్త పడండి.

Also Read : ఈ సహజ పద్ధతులతో కొలెస్ట్రాల్ ఐసులా కరిగిపోతుంది!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget