By: Haritha | Updated at : 16 Jan 2023 01:32 PM (IST)
(Image credit: Pixabay)
కొన్ని రోజులకు ముందు కాన్పూర్ నుండి ఒక నివేదిక వచ్చింది. అక్కడ గుండెపోటుతో కేవలం ఒకే వారంలో 98 మంది మరణించారు. దీనికి కారణం పెరిగిన చలేనని వైద్యనిపుణులు అనుమానించారు. అయితే చలికాలంలో అధికంగా వచ్చే శ్వాసకోశ సమస్యలు గుండెపోటుకు కారణం అవుతాయని కూడా చెబుతున్నారు. చలికాలంలో శ్వాసకోశ సమస్యలు పెరగడానికి కారణం ఇంట్లో వాడే కొన్ని వస్తువులు అయి ఉండచ్చని అనుమానిస్తున్నారు. గ్రామాల్లో చలి పెరగగానే మంట వేసుకుంటారు. ఆ మంట చుట్టూ కూర్చుని చలి కాచుకుంటారు. అదే పట్టణాల్లో అయితే రూమ్ హీటర్లను ఉపయోగిస్తారు. అలాగే బార్బెక్యూ పేరుతో బొగ్గుపై ఆహారాన్ని వండి తినడం కూడా చేస్తుంటారు. ఇవన్నీ శ్వాసకోశ సమస్యలు పెరగడానికి సహకరిస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. శ్వాస సమస్యలు పెరిగి అవి గుండెపోటుకు కారణం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఆక్సిజన్ తగ్గిపోయి...
పట్టణాల్లో రూమ్ హీటర్లను అధికంగా ఉపయోగిస్తారు. పోర్టబుల్ రూమ్ హీటర్లు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. ఇంటి లోపల మూసి ఉన్న ప్రదేశంలో రూమ్ హీటర్లను ఉపయోగించడం వల్ల గాలిలోని ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రాణాంతక వాయువుల పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల శ్వాస సమస్యలు మొదలవుతాయి అని వివరిస్తున్నారు వైద్యులు. ఇక చలికాలం గ్రామాల్లో వేసుకునే మంటల వల్ల కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకరమైన వాయువులు విడుదలవుతాయి. అవి దగ్గరలోనే ఉన్న మనుషులు పీల్చుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల మనకు తెలియకుండానే శ్వాస సమస్య మొదలైపోతుంది. ఊపిరి ఆడక ఇబ్బంది కలుగుతుంది. చివరికి గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది.
కొద్దిరోజుల క్రితం పంజాబ్లోని లూథియానా జిల్లాలో కేవలం ఆక్సిజన్ కొరత కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. వారిద్దరూ రాత్రి ఇంట్లోని ఒక గదిలో నిద్రపోయారు. వారు రూమ్ హీటర్ పెట్టుకున్నారు. వెంటిలేషన్ లేని ఆ గదిలో ఆక్సిజన్ తరిగిపోయి ఊపిరాడక ఉదయం కల్లా మరణించారు. రూమ్ హీటర్ గదిలో పెట్టుకుని నిద్రపోతే ఆక్సిజన్ కరిగిపోయి విషవాయువులు రూమ్‌లో పెరిగిపోతాయి. అది చివరికి గుండెపోటుకు కూడా కారణం అవ్వచ్చు. చలిమంటల ముందు ఎక్కువ సేపు కూర్చోవడం కూడా మంచిది కాదు.
Also read: ఊబకాయం బారిన పడకుండా ఉండాలా? అయితే క్యాబేజీ తినండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Screen Time: ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల కంటిచూపుకే కాదు - చర్మం, జుట్టుకూ నష్టమే
Cauliflower: క్యాలీఫ్లవర్ ఆకులు పడేస్తున్నారా? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట అలా చెయ్యరు
Samantha Diet: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?
అది ప్రేమ హార్మోన్ కాదు, ఆ హార్మోన్ లేకున్నా మనం ప్రేమించగలం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
గంజి నీళ్ళతో ఎన్ని ఉపయోగాలో తెలిస్తే, మీరు కూడా గంజి వచ్చేలా అన్నం వండుతారు
MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం