News
News
X

Raisins: ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి మంచిదే, కానీ ఈ సమస్యలు ఉన్నవాళ్లు జాగ్రత్తపడాలి

ఎండు ద్రాక్ష వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది. అధికంగా తింటే మాత్రం అనర్ధాలు తప్పవు.

FOLLOW US: 
Share:

కిస్మిస్, మునక్కా ఎలా పిలిచినా అది ఒక ఎండిన ద్రాక్షలే.  ప్రాంతాలను బట్టి ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. సాధారణంగా రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటారు. సాంప్రదాయ భారతీయ వైద్యంలో ఇది ఎంతో ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కోలుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. వీటిలో కొవ్వులు ఉండవు. కేలరీలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి కావాల్సిన స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి వీటిని తినడం అన్ని విధాల ఆరోగ్యకరమని ఆంగ్ల వైద్యంతో పాటు సాంప్రదాయ వైద్యం కూడా చెబుతోంది. అందుకే వీటికి అభిమానులు ఎక్కువ. పోషకాహార నిపుణులు రోజూ గుప్పెడు కిస్మిస్‌లను తినమని సూచిస్తారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తినే ముందు వైద్యులను సంప్రదించాలి.

ఎవరు తినకూడదు?
కొందరు తమకున్న ఆరోగ్య సమస్యల కారణంగా రక్తాన్ని పలచబరిచే మందులను వాడుతూ ఉంటారు. ఇలాంటి వారు కిస్మిస్‌లను తినక పోవడమే ఎంతో మేలు. ఎందుకంటే ఆ మందులతో ఈ కిస్మిస్‌లు ప్రతికూల పరస్పర చర్యను జరిపే అవకాశం ఉంది. దీనివల్ల వారి ఆరోగ్యం మరింత దిగజారవచ్చు. అలాగే గర్భవతిగా ఉన్నప్పుడు, పిల్లలకు పాలు ఇస్తున్నప్పుడు కూడా కిస్మిస్‌లను దూరం పెడితే మంచిది. తినేముందు ఓసారి వైద్యున్ని సంప్రదించడం అన్ని విధాలా ఉత్తమం. కిస్మిస్లు ఆరోగ్యానికి మంచివని, అధికంగా తింటే మాత్రం అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా డయేరియా వచ్చే అవకాశం ఉంది. ఇవి అరగడానికి సమయం పడుతుంది. అందుకే జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు, బలహీనమైన జీర్ణశక్తిని కలిగి ఉన్నవారు కిస్మిస్‌లను తక్కువగా తినాలి.

కిస్‌మిస్ వల్ల జరిగే అనర్ధాలు తక్కువే కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ.

1. వీటిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది. దీనివల్ల ఎక్కువ కాలం పాటు ఏమీ తినకుండా ఉండగలుగుతారు. అందుకే అధిక బరువును తగ్గాలనుకునేవారు, రోజు గుప్పెడు కిస్మిస్‌లను తినడం మంచిది. అలాగే ఈ వీటిలో లెప్టిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది కొవ్వును కాల్చేస్తుంది.

2. కిస్‌మిస్‌లో రెస్వెరాట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. శరీరంలోని కణాలలో ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటుంది. ధమనుల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులు లేకుండా ఆ మార్గాన్ని క్లియర్ చేస్తుంది. ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

3. రాత్రంతా నానబెట్టిన కిస్‌మిస్‌లను ఉదయం లేచి తినడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వంటివి తగ్గుతాయి. ఆయుర్వేదం ప్రకారం పిత్తదోషాన్ని నివారించే శక్తి దీనిలో ఉంది. పొట్టలో శీతలీ కరణ ప్రభావాన్ని చూపిస్తుంది. 

4. వీటిని తినడం వల్ల దంతాలకు ఎంతో మంచిది. చిగుళ్ల వాపు వంటి సమస్యలను నయం చేస్తుంది. రోజు అయిదారు కిస్మిస్‌లను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గిపోతుంది. దంత బాక్టీరియాని చంపి దంతక్షయం బారిన పడకుండా కాపాడుతుంది.

5. పిల్లలు, మహిళల్లో అధికంగా రక్తహీనత సమస్య ఉంటుంది. అలాంటివారు రోజూ గుప్పెడు కిస్‌మిస్ తింటే చాలా మంచిది. ఐరన్, విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనతకు సరైన చికిత్సను చేస్తాయి. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.

6. మగవారిలో సంతాన ఉత్పత్తిని పెంచే శక్తి కిస్మిస్‌లకు ఉంది. ఇది కామ ఉద్దీపనకు సహకరిస్తుంది. స్పెర్మ్  కౌంట్ పెంచి సంతాన ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. రాత్రిపూట గోరువెచ్చని పాలలో కిస్మిస్లు నానబెట్టి తాగితే ఎంతో మంచిది. అంగస్తంభన సమస్యకు ఇది సరైన చికిత్స.

Also read: ఈ యాంటీ బయోటిక్స్ తరచూ వాడే అలవాటును మానుకోవాలి - సూచిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 05 Mar 2023 09:45 AM (IST) Tags: Raisins Raisins benefits Raisins for Health

సంబంధిత కథనాలు

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

New Corona Cases : దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు - ఆ వేరియంటే కారణమా ?

New Corona Cases : దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు - ఆ వేరియంటే కారణమా ?

టాప్ స్టోరీస్

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?