(Source: ECI/ABP News/ABP Majha)
Omicron Spread: ఒమిక్రాన్ అలర్ట్.. 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. భయపెడుతోన్న 'R' వాల్యూ
ఒమిక్రాన్, కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న వేళ 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కొత్త కొవిడ్ కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వ్యాప్తి పెరగడంతో చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
#WATCH | On violation of COVID rules in political rallies amid rising infections, Niti Aayog Member (Health) Dr. VK Paul says, "It is in the domain of the Election Commission and it is not the right forum to take up this issue." pic.twitter.com/GnfW50Srup
— ANI (@ANI) December 30, 2021
హరియాణా, దిల్లీ, గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటక, బంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. కేసులు పెరుగుతోన్న దృష్ట్యా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టెస్టింగ్, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, వ్యాక్సినేషన్ స్పీడు పెంచాలని తెలిపారు.
మళ్లీ 10 వేలు దాటిన..
దేశంలో 33 రోజుల తర్వాత కొవిడ్-19 రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు పైగా నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేసులు పెరుగుతున్నందు వల్ల క్షేత్రస్థాయిలో దృష్టిసారించాల్సి ఉందని సూచించింది. 8 జిల్లాల్లో కొవిడ్-19 వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే అధికంగా నమోదవుతోందని, మరో 14 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10 శాతం ఉందని పేర్కొంది.
ఆర్ వాల్యూ..
దిల్లీ, ముంబయి నగరాల్లో కరోనా వ్యాప్తి వేగాన్ని సూచించే ఆర్-వాల్యూ (రీప్రొడక్షన్ నంబరు) 2 దాటిందని పరిశోధకులు తెలిపారు. చెన్నై, పుణె, బెంగళూరు, కోల్‌కతాలో ఆర్-వాల్యూ ఒకటి దాటినట్లు చెన్నై ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్‌కు చెందిన ఓ బృందం గుర్తించింది.
Also Read: Jammu Kashmir Encounter: కశ్మీర్‌లో కాల్పుల మోత.. 2 ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ముష్కరులు హతం
Also Read: EC Press Conference Highlights: యూపీ ఎన్నికలు యథాతథం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Also Read: Covid 19 Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా వ్యాప్తి.. 1000కి చేరువైన ఒమిక్రాన్ కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.