Jammu Kashmir Encounter: కశ్మీర్‌లో కాల్పుల మోత.. 2 ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ముష్కరులు హతం
కశ్మీర్‌లో జరిగిన రెంజు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ముష్కరులు హతమయ్యారు.
కశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. దక్షిణ కశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన టాప్-60 ఉగ్రవాదుల్లో ఒకరైన షాహిద్ అకా షహ్‌జాద్ ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన షాహిద్.. జమ్ముకశ్మీర్‌లో మోస్ట్ వాంటెడ్ టెరర్రిస్ట్‌గా ఉన్నాడు.
మిగిలినవాళ్లు..
మృతుల్లో మరో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ఒకరు త్రాల్ ప్రాంతానికి చెందిన షఫీ దార్ కాగా మరొకరు మిర్‌హామాకు చెందిన ఉజైర్ అహ్మద్‌గా పోలీసులు తెలిపారు. వీరిద్దరూ జేఈఎమ్‌కు చెందిన సీ కేటగిరీ ఉగ్రవాదులుగా పోలీసులు పేర్కొన్నారు.
ఎన్‌కౌంటర్ జరిగిందిలా!
అనంతనాగ్ జిల్లాలోని నౌగామ్ షాహ్‌బాద్, కుల్గాం జిల్లాల్లో జరిగిన ఈ రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం ఆరుగురు ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో మొత్తం నాలుగు ఏకే 47, రెండు ఎం4 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ తెలిపారు. ఆ రెండు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ గాలింపు చేపడుతున్నట్లు ఐజీపీ పేర్కొన్నారు.
రెండు ఘటనల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారని, జవాన్ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కశ్మీర్ ఐజీపీ తెలిపారు.
Also Read: EC Press Conference Highlights: యూపీ ఎన్నికలు యథాతథం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Also Read: Covid 19 Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా వ్యాప్తి.. 1000కి చేరువైన ఒమిక్రాన్ కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.